ఒకానొక టైంలో వరుసగా సినిమాలు చేసి తీరిక లేకుండా గడిపిన మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం స్లోగా సినిమాలు చేస్తున్నారు. దానికికారణం ఆయన చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టడమే. ఫ్లాప్స్ ఉన్న టైంలో ‘రాజా ది గ్రేట్’ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత చేసిన మరో 3 సినిమాలు డిజాస్టర్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం డిస్కో రాజా షూటింగ్ లో బిజీగా ఉన్న రవితేజ తన తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ హిట్ కాంబినేషన్స్ సెట్ చేసుకుంటున్నారు.
ఇటీవలే తనకు ‘బలుపు’, ‘డాన్ శీను’ రూపంలో హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని తో తన తదుపరి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీళ్ళిద్దరిదే హిట్ కాంబినేషన్ అంటే వీళ్ళకి మరో లక్కీ మస్కట్ కూడా తోడైంది. తనే శృతి హాసన్. బలుపులో రవితేజ – శృతి హాసన్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఆల్రెడీ హిట్ కాంబినేషన్ అయిన వీరు ముగ్గురు కలిసి సినిమా చేస్తుండడం సినిమాకి ఆసక్తి కలిగిస్తోంది.
ఇందులో రవితేజ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. శరవేగంగా పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.
130451 561081Deference to op , some superb entropy. 775857