Switch to English

వైఎస్ జగన్‌పై విమర్శల డోసు పెంచిన రామోజీ.! అమిత్ షా ఎఫెక్టేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు ఎప్పుడూ ‘రాజీ పడరు’ అనే చర్చ సర్వత్రా వినిపిస్తుంటుంది. మీడియా రంగంలోనూ ఇద్దరి మధ్యా పోటీ వుంది. రాజకీయాల్లో సంగతి సరే సరి. టీడీపీకి ఆయన రాజగురువుగా చెబుతుంటారు.

గతంలో, అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో.. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థి.. అన్నట్లు తన మీడియా సంస్థల్ని నడిపించారు. ‘ఆ రెండు పత్రికలు..’ అంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నానా రకాల విమర్శలూ చేశారు.. అందులో ప్రధానమైన పత్రిక ఈనాడు.. అది రామోజీరావుదే.

అయితే, కొన్నేళ్ళ క్రితం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా రామోజీరావు దగ్గరకు వెళ్ళి, ఆయనతో భేటీ అయ్యాక.. పరిస్థితులో కాస్త మార్పు వచ్చింది. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళలో ఈనాడులో జగన్ వ్యతిరేక కథనాల్లో పస తక్కువగా వుంటూ వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపడం ద్వారా మీడియా పరంగా తమ బాధ్యతను రామోజీ అండ్ టీమ్ సక్రమంగానే.. ఆ మాటకొస్తే, ఇంకాస్త ఎక్కువ సక్రమంగానే నిర్వర్తించారని అనుకోవాలేమో.!

టీడీపీ పట్ల ప్రేమ వున్నా, వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వున్నా, రామోజీ గ్రూపు మీడియా సంస్థల ద్వారా ఒకింత డిప్లామాటిక్ కథనాలు వచ్చేవి. కానీ, ఏమయ్యిందో.. మళ్ళీ పాత వ్యవహారాన్ని తలపించే కథనాలు షురూ అయ్యాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన భూ కుంభకోణాలు, వాటితో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లింకు, అక్రమాస్తుల కేసులు.. వీటన్నిటికీ ముడిపెడుతూ చాలా పెద్ద కథనం ఈనాడులో ఫ్రంట్ పేజీలో దర్శనమిచ్చింది.

అది కూడా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రామోజీరావుతో భేటీ అయిన తర్వాత కావడం గమనార్హం. అంటే, బీజేపీ నుంచి.. లేదా కేంద్రం నుంచి.. రామోజీరావుకి భరోసా వచ్చిందని అనుకోవాలా.? గతంలో వైఎస్ జగన్ స్వీట్ వార్నింగ్ ఇవ్వడం వల్ల కొంచెం వెనక్కి తగ్గిన రామోజీ, ఇప్పుడు మళ్ళీ జూలు విదిల్చినట్లేనా.? ఏమో, అలాగే అనుకోవాలేమో.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...