మొత్తానికి పూరి జగన్నాధ్ టెన్షన్ ని దూరం చేసాడు ఇస్మార్ట్ శంకర్. వరుస పరాజయాలతో కెరీర్ పరంగా వెనకపడిపోయిన పూరి జగన్నాధ్ కు రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ కొత్త ఉత్సహాన్ని నింపింది. ఇప్పటికే విడుదలై అన్ని సెంటర్స్ లో భారీ కలక్షన్స్ వసూలు చేస్తూ దూసుకుపోతుంది. రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ వసూళ్లు అందుకున్న సినిమా ఇదే. ఇక పూరి జగన్నాద్ కూడా ప్లాపుల్లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఏ హీరో కూడా తనకు సినిమా ఇవ్వలేదు సరికదా .. ఫోన్ చేసిన రెస్పాండ్ అయ్యేవారు కాదు. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో పూరి మళ్ళీ కొత్త శక్తి పుంజుకున్నాడు.
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పూరి జగన్నాధ్ కు అభినందనలు చెప్పాడు. ఇస్మార్ట్ శంకర్ లో రామ్ పాత్ర చాలా బాగుందని, రామ్ అదరగొట్టాడని ట్విట్టర్ ద్వారా తన అభినందనలు చెప్పాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా విషయంలో ఇప్పటి వరకు ఏ హీరో స్పందించలేదు .. కానీ రామ్ చరణ్ స్పందించడంతో అంచనాలు మారిపోతున్నాయి. తనను హీరోగా చేసిన దర్శకుడు కాబట్టి అలా చెప్పాడా .. లేక .. పూరి ఎప్పటినుండో మెగాస్టార్ తో సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు. ఆ విషయంగా ఉంటుందా అంటూ రకరాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అన్నట్టు చిరంజీవి కూడా ఇస్మార్ట్ శంకర్ స్పెషల్ షో చూసేందుకు ఓకే చెప్పారట !!
ఇదివరకే పూరి జగన్నాద్ చిరంజీవి కోసం ఆటో జానీ అంటూ ఓ స్క్రిప్ట్ చెప్పాడు. మొదటి భాగం నచ్చింది రెండో భాగం బాగాలేదని చెప్పఁడంతో ఆ కథను మార్చే పనిలో పడ్డ పూరి స్క్రిప్ట్ తెచ్చినా అది చిరుకు నచ్చలేదు .. అలా నాలుగు సార్లు కొత్త కథలను చెప్పినా వర్కవుట్ కాలేదు. అయినా సరే చిరంజీవి తో సినిమా ఖచ్చితంగా చేసి తీరతా అంటున్న పూరికి ఇలా రామ్ చరణ్ సపోర్ట్ దొరికిందంటే .. మెగా సినిమా పట్టాలు ఎక్కడం ఖాయం !! ఏమంటారు.
541875 211314you use a great weblog here! do you wish to earn some invite posts on my small weblog? 790488
506263 671135You ought to experience a contest personally with the finest blogs on-line. Im going to suggest this page! 144093