‘మీరు సెలబ్రిటీ కదా.. పబ్బుకి వెళ్ళడమేంటి.?’ ఇది మీడియా ప్రశ్న.. దానికి రాహుల్ సిప్లిగంజ్ సమాధానమేంటో తెలుసా.? ‘మీరు బారుకెళ్తారు.. నేను పబ్బుకెళ్తాను..’.! తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 రియాల్టీ షో విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్, మనసుకి ఏం అనిపిస్తే అది మాట్లాడేస్తాడు. అది నోటి దురద.. అని కొందరంటారు. మరికొందరేమో నిజాయితీ.. అంటారు.
వివాదాల సంగతి పక్కన పెడితే, రాహుల్ సిప్లిగంజ్‌కి మిగతా కంటెస్టెంట్స్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి గనుక.. రాహుల్ వ్యవహార శౖలిని తప్పు పట్టగలమా.? అన్నది ఇంకో చర్చ. తాజాగా పబ్‌లో జరిగిన ఓ గొడవ కారణంగా రాహుల్ వార్తల్లోకెక్కాడు. తొలుత కేసు పెట్టడానికి రాహుల్ భయపడ్తున్నాడనే ప్రచారం జరిగినా, ‘నేనెవరికీ భయపడే రకం కాదు..’ అని వివరణ ఇచ్చాడు, పోలీసులకు ఫిర్యాదు చేశాక.
‘అవతలి వ్యక్తికి పొలిటికల్ బలం వుంది..’ అన్న మీడియా మాటకి సమాధానమిస్తూ, ‘ఫాల్తూగాడు.. వాడు నన్నేం చేస్తాడు..’ అంటూ మండిపడ్డాడు. ‘నేను ఓ సామాన్యుడ్ని.. పబ్బుకి వెళితే తప్పేంటి.?’ అని ప్రశ్నించాడు. రాహుల్ సిప్లిగంజ్. ‘జస్టిస్ వుంది.. జస్టిస్ జరుగుతుందని ఆశిస్తున్నాను..’ అంటూ మేటర్ క్లియర్‌గా చెప్పేసిన రాహుల్ సిప్లిగంజ్, ఘటనలో తన తప్పేమీ లేదని గుండె మీద చెయ్యేసుకుని చెప్పగలనని అన్నాడు.
‘నా కాలర్ పట్టుకున్నాక కూడా, వదిలెయ్ భయ్యా..’ అని మర్యాదగా చెప్పలేనంటోన్న రాహుల్ సిప్లిగంజ్, అవతలి నుంచి ఎటాక్ షురూ అయ్యాక, తాను కూడా నోరు జారాల్సి వచ్చిందనీ, అది అప్పటికప్పుడు ఆవేశంలో వచ్చిన మాటలేనని రాహుల్ క్లారిటీ ఇచ్చాడు. రాహుల్ మాటలకి మీడియా ప్రతినిథులు కాస్త హర్ట్ అయ్యారు.
‘నేను ఇప్పటిదాకా మద్యం సేవించలేదు.. కావాలంటే టెస్ట్ చేసుకోండి..’ అని రాహుల్‌ని ఉద్దేశించి అన్నాడు. ‘ఏదో జనరల్‌గా అందరి గురించీ మాట్లాడితే, మీడియా ప్రతినిథులు మీరెందుకు పర్సనల్‌గా తీసుకుంటారు..’ అని రాహుల్ వివరణ ఇచ్చాడు. మొత్తమ్మీద, ఈ ఘటనలో రాహుల్ కాస్తంత సీరియస్‌గానే వున్నట్లు కన్పిస్తోంది. మరి, అటువైపు పొలిటికల్ పవర్ గట్టిగా వున్న నేపథ్యంలో రాహుల్, ఆ పవర్‌ని తట్టుకుని నిలబడగలడా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
976766 879426dude this just inspired a post of my own, thanks 838588
646234 551832The post posted was quite informative and beneficial. You folks are doing a fantastic job. Maintain going. 25328
499387 519187Hello. splendid job. I did not anticipate this. This is a fantastic story. Thanks! You created certain fine points there. I did a search on the subject matter and found the majority of folks will have exactly the same opinion along with your blog. 45423