తెలుగులో బిగ్ బాస్ రియాల్టీ షో మూడో సీజన్‌కి సంబంధించి హాటెస్ట్ కంటెస్టెంట్స్ చాలామందే వున్నారు. శ్రీముఖి, అషు రెడ్డి, హిమజ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరూ తక్కువ కాదు. కానీ, అందరిలోకీ షాకింగ్ అప్పీయరెన్స్ మాత్రం పునర్నవి భూపాలందే. ఈ తెలుగమ్మాయ్ తొలి తెలుగు సినిమాతోనే తనదైన ముద్ర వేసింది. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టరే అయినా.. ‘సునీత’ పాత్రలో పునర్నవి అదరగొట్టేసింది.. అది ‘ఉయ్యాల జంపాల’ సినిమా కథ.
రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఆ సినిమాలో అవికా గోర్ హీరోయిన్గా నటించిన విషయం విదితమే. పునర్నవి విషయానికొస్తే, ‘ఉయ్యాల జంపాల’ తర్వాత పలు సినిమాల్లో నటించింది. హీరోయిన్గా పెద్దగా గుర్తింపు దక్కించుకోకపోయినా, ఎప్పుడైతే బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా గాసిప్స్లోకి ఎక్కిందో.. అక్కడినుంచీ ఆమెకి అనూహ్యంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది.
తన మీద పెరిగిపోయిన అంచనాల్ని అందుకోవాలి కాబట్టి.. ఒకింత హాట్‌గా కనిపించాలనుకుందో ఏమోగానీ, ఓపెనింగ్ డే ఈవెంట్లో అదరగొట్టేసింది పునర్నవి. మిగతా కంటెస్టెంట్స్ అంతా తమదైన డాన్స్ షోలతో అదరగొట్టేసినా, పునర్నవి డాన్స్ షో మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అందుక్కారణం బహుశా పునర్నవి డ్రెస్సింగే కావొచ్చు. అంత హాట్‌గా ఆమె డ్రెస్సింగ్ కన్పించింది.
అయితే, పునర్నవి వరస్ట్‌గా డ్రెస్సింగ్ చేసుకుందనీ, ఐటమ్ బాంబుకి ఏమాత్రం తగ్గని రీతిలో వల్గారిటీ ప్రదర్శించిందనీ సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు దర్శనమిస్తున్నాయి. విమర్శలు, వివాదాల సంగతి పక్కన పెడితే, పునర్నవి ఆటిట్యూడ్ మాత్రం బిగ్‌బాస్‌కి పక్కాగా సూటయ్యేలానే వుంది. ఎప్పటికప్పుడు గేమ్ ప్లాన్స్ చేంజ్ చేసుకుంటూ విన్నర్‌గా నిలిచేందుకు ప్రయత్నిస్తాననే ధీమా వ్యక్తం చేస్తోంది పునర్నవి.
226438 621329Id must consult you here. Which is not some thing It is my job to do! I spend time reading an write-up that may get individuals to think. Also, numerous thanks for permitting me to comment! 267742
678518 163833Flexibility means your space ought to get incremented with the improve in number of weblog users. 74518
325676 866732Hey! I simply wish to give an enormous thumbs up for the excellent data youve got here on this post. I will likely be coming back to your blog for far more soon. 462836
215026 859413Come across back yard garden unusual periods of ones Are generally Weight reduction and every 1 1 may possibly be critical. 1 way state could possibly be substantial squandering by way of the diet. lose weight 571935