Prabhas: ప్రభాస్ తొలిసారిగా ఆదిపురుష్ పౌరాణిక సినిమాలో శ్రీరాముడిగా నటిస్తున్నారు. ఆరడగుల ఆజానుబాహువు.. అందగాడు ప్రభాస్ కంటే శ్రీరాముడి పాత్రకు మరెవరూ సూట్ అవుతారు కనుక ఫ్యాన్స్ హాపీస్. కానీ దర్శకుడు ఓంరౌత్ శ్రీరాముడికి మీసాలు తగిలించి, లక్ష్మణుడుకి, హనుమంతుడు, చివరికి రావణుడు అందరికీ గడ్డాలు తగిలించేసి అడ్డదిడ్డంగా ఫస్ట్-లుక్, కార్టూన్ సినిమా వంటి టీజర్ వదిలేసరికి ఫాన్స్ కూడా షాక్ అయ్యారు. ఇక మిగిలిన జనాల సంగతి తెలిసిందే.
ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో పౌరాణిక సినిమా చేయబోతున్నారని దిల్రాజు అనౌన్స్ చేయగానే ప్రభాస్ ఫాన్స్ ఎగిరి గెంతేయాలి కానీ ఓం రౌత్ ఇస్తున్న షాకుల నుంచి ఇంకా తేరుకోలేదు కనుక బహుశః గతుక్కుమని ఉంటారేమో?
ఈరోజుల్లో ప్రభాస్ పౌరాణికాలు చేయడం ఏమిటి?అని అనిపించకమానదు. పైగా ఒక్కో సినిమాకి మూడు, నాలుగేళ్ళు తీసుకొంటుంటే మరో పది సినిమాలు చేసేసరికి రిటైర్ అయిపోతారేమో?అని ఫాన్స్ వర్రీ అవుతున్నారు. అసలు ప్రభాస్ నుంచి అభిమానులు, సగటు ప్రేక్షకులు ఆశిస్తున్నది ఏమిటి? మిర్చి లాంటి ఓ చక్కటి రొమాంటిక్ ఎంటర్టైనర్ లేదా ప్రాజెక్ట్-కె వంటి ఓ యాక్షన్ మూవీ. మద్యలో విరామం కోసం మారుతితో ఓ రాజా డీలక్స్ పర్వాలేదు. కానీ ఇలా త్రేతాయుగంలోకి వెళ్ళిపోతానంటే ఎలా?
ఆదిపురుష్ గురించి ఎవరైనా ఎదురుచూస్తున్నారో లేదో తెలీదు కానీ సలార్, ప్రాజెక్ట్-కె, స్పిరిట్, రాజా డీలక్స్(?) కోసం మాత్రం అందరూ ఎదురుచూస్తున్నారు. కనుక ప్రభాస్ ఇలాంటి పౌరాణిక ప్రయోగాల జోలికి పోకుండా జనాలకు ఏం కావాలో అది చేస్తే అందరూ హ్యాపీస్!
28023 997865I believe one of your commercials caused my internet browser to resize, you could properly want to put that on your blacklist. 105896
106523 859149I like this post, enjoyed this one appreciate it for putting up. 291966