Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయతి (Dimple Hayathi) పై జూబ్లీ హిల్స్ (Jubulee Hills) పోలిస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును డింపుల్ ధ్వంసం చేసిందనే ఆరోపణలపై పోలీసులు ఆమె, డేవిడ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..
జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని హుడా ఎన్ క్లేవ్ లో డింపుల్, డీసీపీ హెగ్డే నివసిస్తున్నారు. సెల్లార్లో పార్కింగ్ చేసున్న డీసీపీ అధికారిక వాహనాన్ని డింపుల్ ధ్వంసం చేసింది. దీంతో డీసీపీ డ్రైవర్ చేతన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు.
‘అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పును కప్పిపుస్తున్నా’రంటూ డింపుల్ ట్వీట్ చేసింది. డీసీపీ హెగ్డే స్పందిస్తూ.. ‘పోలీసు అధికారిని కావడంతో అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఆమె కారు అడ్డుపెట్టి ఇబ్బంది పెడుతోంది. ఎన్నిసార్లు చెప్పినా ఆమె తీరు మారలేదు. నేను అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నానని ఆమె అంటున్నారు.. పోలీసు విచారణలో నిజాలు బయటకొస్తాయ’ని అన్నారు.