దేశంలో నిరుద్యోగం, నియామకాలపై బీజేపీ ప్రభుత్వం విపక్షాల నుంచి నిరంతరం విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఉద్యోగ నియామకాలపై ప్రధాని మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాబోయే ఏడాదిన్నరలో 10లక్షల నియామకాలు చేపట్టాలని వారికి సూచించారు. ఈమేరకు పీఎంఓ ట్వీట్ చేసింది.
అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలు, ఆర్ధిక స్థితిగతులపై సమీక్షించిన ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. పీఎంఓ పోస్టు ప్రకారం.. ‘మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీలు.. వంటి స్థితిగతులపై ప్రధాని సమీక్షించారు. అనంతరం ఏడాదిన్నరలో మిషన్ మోడ్ కింద 10లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. యుద్ధప్రాతిపదికన నియామకాలు భర్తీ చేయాలని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు’ అని తెలిపింది. అంతకుముందు ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయి.. మంత్రిత్వశాఖలు, ఆర్ధికపరమైన విధానాలపై చర్చించింది.
496029 380907I dont normally look at these types of sites (Im a pretty modest person) – but even though I was a bit shocked as I was reading, I was surely a bit excited as effectively. Thanks for making my day 867920
341174 387537This web internet site is my inspiration , really superb layout and perfect subject matter. 842195
102509 349965I think your suggestion would be useful for me. I will let you know if its work for me too. Thank you for sharing this beautiful articles. thanks a whole lot 83241
403943 794722I dugg some of you post as I cogitated they were extremely beneficial invaluable 232058