జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ హ్యాండిల్ ఫాలోవర్స్ సంఖ్య 4 మిలియన్లకు చేరుకుంది. ఈ ఫాలోవర్స్ లిస్ట్‌లో పలువురు సినీ ప్రముఖులున్నారు. సినీ అభిమానులున్నారు. అంతెందుకు, పవన్‌కళ్యాణ్‌ని వ్యతిరేకించేవారు కూడా వున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌ని అత్యంత బాధ్యతాయుతంగా వినియోగిస్తున్నారు. అభిమానుల్ని ఉర్రూతలూగించేలా సినిమాటిక్ ట్వీట్లు ఆయన ట్విటర్ హ్యాండిల్లో కన్పించవు. సమస్యలపై తనదైన శౖలిలో స్పందిస్తుంటారు. ఈ క్రమంలో ట్రోల్స్ సర్వసాధారణమే. అయినా, ట్రోల్స్‌ని పవన్ ఏనాడూ పట్టించుకోలేదు.
సోషల్ మీడియా ద్వారా జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. సేవా కార్యక్రమాల్లో తమదైన ముద్ర వేసిన జనసైనికుల్ని సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. ఇక, తన ట్విట్టర్ హ్యాండిల్ ఫాలోవర్స్ సంఖ్య 4 మిలియన్లకు చేరుకున్న నేపథ్యంలో పవన్ ఓ ఇన్స్పిరేషనల్ ట్వీటేశారు. ‘రాజకీయం అంటే మాకు నేషనల్ సర్వీస్..’ అంటూ పవన్ చెప్పిన మాట చాలా చాలా ప్రత్యేకమైనది. కక్ష పూరిత రాజకీయాలు, విషపూరితమైన సోషల్ మీడియా.. అంటూ పవన్ తనదైన స్టయిల్లో ఆయా అంశాల్ని ప్రస్తావించారు. మార్పు కోసం జనసేన పార్టీ కట్టుబడి వుందనీ, దేన్నయినా తట్టుకుని నిలబడుతుందని ఆయన చెప్పారు ట్వీట్ ద్వారా. 4 మిలియన్ల మంది ‘మార్పు కోరుకునేవారికి’ కృతజ్ఞతలు తెలిపారు.
మరోపక్క, పవన్ కళ్యాణ్ అభిమానుల ఆలోచనలు కూడా మారాయి. గతంలోలా ఎవరో రెచ్చగొడితే, రెచ్చిపోయే పరిస్థితి లేదు. సోషల్ మీడియాలో జనసైనికులు ఇటీవలి కాలంలో పాటిస్తున్న ‘సంయమనం’ అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఎలాగైనా పవన్ అభిమానుల్ని రెచ్చగొట్టి ‘పబ్లిసిటీ పబ్బం’ గడుపుకోవాలనుకుంటోన్న ‘సోకాల్డ్’ ప్రముఖులకి పవన్ అభిమానులు తమ సంయమనంతోనే ‘చెంప పెట్టు’ లాంటి సమాధానమిస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య ఎంతన్నది కాదు ముఖ్యం.. ఎంతమంది ఫాలోవర్స్, తాము ఇష్టపడే వ్యక్తి భావజాలాన్ని అభిమానిస్తున్నారన్నదే ముఖ్యం. ఈ విషయంలో పవన్ అభిమానులు చాలా చాలా ప్రత్యేకం.
My heartfelt 🙏 gratitude to 4 million ‘Change Seekers.’ pic.twitter.com/XCzameXzWR
— Pawan Kalyan (@PawanKalyan) July 11, 2020
153865 52421Hey there! Nice stuff, please maintain us posted when you post again something like that! 53250
795950 878269Youd superb suggestions there. I did a research about the problem and identified that likely almost anyone will agree together with your internet page. 410602
116892 106955Searching forward to move into another hous?! […]Real estate busines is getting much more and a lot more less protitable, have a look at why[…] 89482
70174 321174Good post. I previousally to spend alot of my time water skiing and watching sports. It was quite possible the very best sequence of my past and your content material kind of reminded me of that period of my life. Cheers 357826
699078 99015I genuinely enjoy seeking at on this website , it has wonderful content . 22721