Switch to English

పవన్‌ మలయాళం రీమేక్‌ టైటిల్‌ హింట్ ఇచ్చారు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ ‘అయ్యప్పన్‌ కోషియమ్’ ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారు దాదాపు ఏడాది క్రితం రీమేక్‌ రైట్స్‌ తీసుకుని టాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో రీమేక్‌ చేయాలని భావించారు. మల్టీస్టారర్‌ కాన్సెప్ట్‌ అవ్వడంతో సినిమాకు పలువురు హీరోలు నో చెప్పారు. చివరకు పవన్‌ కళ్యాణ్‌ ఓకే చెప్పాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారు నిన్న దసరా సందర్బంగా ఈ సినిమాను అధికారికంగా పవన్‌ హీరోగా ప్రకటించారు. పవన్‌ కళ్యాణ్‌ తో పాటు ఈ సినిమాలో మరో హీరోగా రానా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఆ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమాకు టైటిల్‌ గా ‘బిల్లా రంగా’ ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయ్యప్పన్‌ కోషియమ్‌ సినిమా కథానుసారంగా ఇద్దరి మద్య సాగే ఆసక్తికర కథ. అందుకే బిల్లా మరియు రంగాల మద్య ఆ కథ సాగినట్లుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దాంతో ఖచ్చితంగా ఒక మంచి తెలుగు నేటివిటీ ఫీల్‌ వస్తుందనే అభిప్రాయంను సినీ వర్గాల వారు వ్యక్తం చేశారు. అందుకే బిల్లా రంగాను అనుకుంటున్నారు. 1982లో చిరంజీవి మోహన్‌ బాబులు కలిసి నటించిన సినిమా బిల్లా రంగా టైటిల్‌ తో వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు మళ్లీ బిల్లా రంగా టైటిల్‌ ను పవన్‌ మూవీ కోసం సితార వారు రీ రిజిస్ట్రర్‌ చేయించారు అనే టాక్‌ వస్తుంది. నిన్న విడుదలైన సినిమా అధికారిక ప్రకటన వీడియోలో బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ లో బిల్లా రంగా అన్నట్లుగా వినిపిస్తుంది. కనుక సినిమాకు అదే టైటిల్‌ ను కన్ఫర్మ్‌ చేసే అవకాశం ఉందని అంటున్నారు. బిల్లా రంగా సినిమాను మంచు మనోజ్ మరియు సాయి ధరమ్‌ తేజ్‌ లు రీమేక్‌ చేయాలనుకున్నారు. ఈలోపే పవన్‌ చేసేయబోతున్నాడు. కేవలం నెల రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. వచ్చే ఏడాది పవన్‌ చేయబోతున్న సినిమాలకు ఇది అదనం.

3 COMMENTS

  1. 141241 844437The next time I just read a weblog, I genuinely hope which it doesnt disappoint me up to this one. Get real, Yes, it was my choice to read, but I personally thought youd have something interesting to convey. All I hear can be a handful of whining about something you could fix in the event you werent too busy trying to uncover attention. 170509

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...