Switch to English

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో సమస్యలు..! రోగుల అవస్థలు..!!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,378FansLike
57,764FollowersFollow

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పరిస్థితులు రోగులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఏజెన్సీ నిర్వాహకులు, ఆసుపత్రి పెద్దలు, వైద్యులు, సూపరింటెండెంట్ మధ్య నెలకొన్న సమన్వయ లోపం వారికి శాపంగా మారుతోంది. జీజీహెచ్‌ వైద్యులే న్యూరో సర్జరీ ఓపీ విభాగానికి ఎంఆర్‌ఐ చేయించాలని రాసిచ్చినా ఫిల్మ్‌ లేనిదే అడ్మిషన్‌ చేసుకోలేమంటున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఆదేశించినా అదే పరిస్థితి.

ఎంఆర్‌ఐ, సీటీ పరీక్షల నిర్వహణను ప్రభుత్వం ఏజెన్సీలకు అప్పగించింది. పరీక్షలు నిర్వహించి రిపోర్టు, ఫిల్మ్స్‌ కూడా ఏజెన్సీలే ఇవ్వాలి. కానీ.. ఇటివలి ఎంఓయూ ప్రకారం ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ చేశాక ఫిల్మ్‌లు ఇవ్వకూడదని నిర్ణయించారు. దీనికి సంబంధించి 16 రోజుల క్రితం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వేసిన కమిటీ పరిశీలించి ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ చేశాక రిపోర్టులు మాత్రమే ఇవ్వాలని ఆదేశించడంతో ఫిల్మ్‌లు నిలిచిపోయాయి.

న్యూరో సర్జరీ, సర్జరీ, న్యూరాలజీ, గ్యాస్ర్టో ఎంట్రాలజీ రోగులకు ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ పరీక్షల అనంతరం రిపోర్టులు మాత్రమే ఇస్తూండటంతో వైద్యులు సరైన చికిత్స అందించలేకపోతున్నారు. ఫిల్మ్‌ ఉంటేనే ఖచ్చితమైన చికిత్స, ఆపరేషన్లు చేయగలుగుతారు. దీంతో ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో న్యూరో సర్జరీలో కొన్ని ఆపరేషన్లు జరగకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ రిపోర్టు, ఫిల్మ్‌ విషయంలో 15 రోజుల నుంచీ ఫిర్యాదులు వస్తున్నాయి. అధికారుల ఆదేశాలు, ఏజెన్సీల మొండి వైఖరి మధ్య రోగులు నలిగిపోతున్నారు. ఎంఆర్‌ఐ ఫిల్మ్‌కు రూ.250, సీటీ స్కాన్‌ పిల్మ్‌కు రూ.200 వసూలు చేయడం తమ ఎంఓయూలో లేదని ఆసుపత్రి అధికారులు అంటున్నాయి. అయితే.. న్యూరో సర్జరీ, గ్యాస్ర్టో ఎంట్రాలజీ విభాగాల్లో అడ్మిట్‌ అయిన రోగులకైనా ఫిల్మ్‌ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రోగులు వారి బంధువులు కోరుతున్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ ఫిల్మ్‌లను అర్ధాంతరంగా నిలిపేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేవలం కర్నూలులోనే ఈ విధానం ఉండటంతో రోగులు మండిపడుతున్నారు. దీనివల్ల వైద్యులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఫిల్మ్‌ లేకపోవడంతో డాక్టర్లు ప్రతిసారీ కంప్యూటర్ వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాలని రోగులు కోరుతున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vishwak Sen: ‘వీళ్లు పైరసీ కంటే డేంజర్’.. యూట్యూబర్ పై విశ్వక్...

 Vishwak Sen: ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన...

Kalki: కథ రాయడానికే అన్నేళ్లు పట్టింది.. ఆ ప్రశ్నలకు క్లైమాక్స్ ‘కల్కి’:...

Kalki: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’. (Kalki 2898 AD) జూన్ 27న...

Chiranjeevi: చిరంజీవికి రాజ్యసభ సీటు..!? సుస్మిత కొణిదెల ఆసక్తికర సమాధానం

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల (Suhhmita Konidela నిర్మాతగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘పరువు’. జీ5లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ కు...

Teja: దర్శకుడు తేజ ఆవిష్కరించిన ‘పోలీస్ వారి హెచ్చరిక’ టైటిల్ లోగో

Teja: బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పోలీస్ వారి హెచ్చరిక’ (Police vari Hecharika). తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమాకు బెల్లి...

Janhvi Kapoor: ‘అవి మావి కావు’.. జాన్వీ కపూర్ ఎక్స్ పోస్టులపై...

Janhvi Kapoor: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు, ఫ్యాషన్, ఫొటోషూట్స్.. అభిమానులతో పంచుకుంటూ...

రాజకీయం

తమ్మినేని ‘బూతు’.. చింతకాయల ‘బూతు’.! ఎవరు సుద్ద పూస.?

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.! వైసీపీ నాయకుడిగా మారకముందు తమ్మినేని సీతారాం వేరు, వైసీపీ నాయకుడయ్యాక తమ్మినేని సీతారాం వేరు.! ఔను, స్పీకర్ పదవికి...

వైఎస్ జగన్ ‘తాడేపల్లి ప్యాలెస్‌’పై ఎందుకింత రచ్చ.?

కాదేదీ, రాజకీయానికి అనర్హం.! ఔను, ఇందులో వింతేముంది.? ఏళ్ళ తరబడి.. కాదు కాదు, దశాబ్దాలుగా చూస్తున్నదే కదా.! కాకపోతే, ఇప్పుడు రాజకీయం మరింత దిగజారిపోయింది.! ఫామ్‌హౌస్‌లో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు.? లింగమనేని...

ఈవీఎంలు మోసం చేశాయ్.! వైఎస్ జగన్ కొత్త నాటకం.!

ఓటమికి కారణం దొరికేసింది.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన ఓటమికి కారణమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై యుద్ధం ప్రకటించేశారు.! వైసీపీ కార్యకర్తలంతా, ‘మేము సైతం సిద్ధం’ అంటూ సోషల్ మీడియా వేదికగా...

ఈసారి అసెంబ్లీ సెషన్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి మూడు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ...

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

ఎక్కువ చదివినవి

పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా: టీడీపీలో కొందరికి నచ్చట్లేదా.?

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా, ‘పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా’ అనే బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. ఆ బ్యానర్ల మీద, జనసేన నేతల ఫొటోలే కాదు, టీడీపీ అలాగే బీజేపీ నేతల ఫొటోలూ...

సంక్షేమ పథకాలకి సొంత పేర్లు.! ఇకనైనా ఆపేస్తే మంచిది.!

సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చవు.! 2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు తేల్చి చెప్పిన విషయమిది.! సంక్షేమ పథకాలకి సొంత పేర్లు పెట్టుకుంటే, జనం ‘ఛీ’ కొడతారన్న విషయం స్పష్టమయ్యాక...

ఈసారి అసెంబ్లీ సెషన్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి మూడు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ...

భారీ వేతనంతో సింగరేణిలో ఉద్యోగాలు

కొత్తగూడెం లోని సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ వివిధ భాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ క్యాడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.! తర్వాతేంటి.?

‘సీఎం.. సీఎం.. అంటూ అరిస్తే సరిపోదు.. ఓట్లెయ్యండి.. ఓట్లు వేయించండి.. అభిమానులు, జనసైనికుల్లా మారండి. చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు, సీట్లు సాధించగలిగినప్పుడు.. పదవులు వాటంతట అవే వస్తాయ్..’ అని పలు సందర్భాల్లో అభిమానుల్ని...