యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ తో కలిసి ఈ భారీ మల్టి స్టారర్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తరువాత నెక్స్ట్ సినిమాలను లైన్ లో పెట్టాడు ఎన్టీఆర్ . అందులో ఇప్పటికే తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తో పాటు కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నిల్ ని కూడా ఉన్నారు.
వీరితో పాటు తాజగా విజయ్ దేవరకొండతో పెళ్లి చూపులు అంటూ మంచి కూల్ హిట్ తో పరిశ్రమను ఆకర్షించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తో కూడా సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ హీరోగా మీకు మాత్రమే చెబుతా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది ఎవరో కాదు విజయ్ దేవరకొండ. ఈ సినిమా షూటింగ్ పూర్తీ చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.
తాజగా ఎన్టీఆర్ తో చర్చలు జరిపాడట తరుణ్ భాస్కర్. ఈ సందర్బంగా ఓ లైన్ కూడా చెప్పాడని, ఆ లైన్ ఎన్టీఆర్ కు బాగా నచ్చడంతో డెవలప్ చేయమని చెప్పాడట. ప్రస్తుతం హీరోగా మీకు మాత్రమే చెబుతా విడుదల తరువాత తరుణ్ భాస్కర్ వెంటనే వెంకటేష్ తో సినిమా చేయనున్నాడు. రేసు కోర్స్ నేపథ్యంలో సాగె కథ ఇది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని టాక్. మొత్తానికి ఎన్టీఆర్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేస్తాడో మరి !!
525209 98014Some genuinely rattling work on behalf with the owner of this web site , utterly excellent content material . 38583
366007 877112Excellent blog, Im going to spend much more time reading about this topic 833684