‘మేం అధికారంలోకి వస్తే అమరావతిని అభివృద్ధి చేస్తాం.. హైద్రాబాద్ కంటే పెద్ద నగరంగా తీర్చిదిద్దుతాం. కేంద్రం సాయం చేసినా చెయ్యకపోయినా, మా బుర్రలో ఆలోచనలున్నాయ్.. వాటి ప్రకారం అభివృద్ధి చేస్తాం..’ అంటూ అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో కీలక వ్యాఖ్యలు చేశారుగానీ, అధికారంలోకి వచ్చాక అమరావతి మీద ‘కమ్మరావతి’ అనే ముద్ర వేయించేశారు తన పార్టీ ద్వారా, ప్రభుత్వం ద్వారా.
కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని మంత్రిగా వున్నప్పుడే, ‘అమరావతిలో శాసన రాజధాని కూడా వుండకూడదు..’ అనేలా వైసీపీ అధినాయకత్వం చక్రం తిప్పింది. అమరావతి పేరుతో ‘కమ్మ’ సామాజిక వర్గంపై ద్వేషాన్ని అలా చాటుకుంది వైఎస్సార్సీపీ.
చివరికి, ఆ ఒక్క కమ్మ ‘మంత్రి’ని కూడా పక్కన పడేశారు. కొత్త క్యాబినెట్లో కమ్మ సామాజిక వర్గానికి చోటే లేకుండా పోయింది. హైలీ రెస్పెక్టెడ్ సామాజిక వర్గానికి మాత్రం తగినన్ని పదవులు వుండేలా చూసుకున్నారండోయ్. ఇక, వైశ్య సామాజిక వర్గానికీ పదవుల్లేవ్. క్షత్రియ సామాజిక వర్గాన్నీ పక్కన పెట్టారు.
బీసీల్ని ఉద్ధరించేస్తున్నాం.. అని చెప్పుకుంటారుగానీ, అసలు చట్ట సభల్లోనే చాలా బీసీ సామాజిక వర్గాలకు ప్రాతినిథ్యం లేదాయె.. వాటికి మంత్రి పదవుల గురించి అనుకోవడానికేమీ లేదు. కార్పొరేషన్లు, నామినేటెడ్ పోస్టుల పేరుతో ఆయా సామాజిక వర్గాల ఓటు బ్యాంకుకి గాలం వేయడం తప్ప, సమగ్రాభివృద్ధి అన్న ఆలోచన ఎక్కడిది.?
మిగతా సంగతెలా వున్నా, కమ్మ సామాజిక వర్గం.. ఇప్పుడు తీవ్రస్థాయిలో వైసీపీ మీద గుస్సా అవుతోంది. అయి మాత్రం ఏం చేయగలదు.? తమ పార్టీ టీడీపీ అధికారంలో వున్నప్పుడు, తమకే పూర్తి న్యాయం చేసిందనే భావనతో వున్న.. ఆ కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు గింజుకున్నా ప్రయోజనం లేదు.
కమ్మ సామాజిక వర్గాన్ని జీరో చేసినట్లే, తమ హైలీ రెస్పెక్టెడ్ సామాజిక వర్గాన్ని (అదేనండీ రెడ్డి సామాజిక వర్గాన్ని) జీరో చేసి, అసలంటూ చట్ట సభల్లో స్థానమే లేని సామాజిక వర్గాలకి మంత్రి వర్గంలో చోటు కల్పించి వుండొచ్చు కదా.? ఇంకా నయ్యం.. అంత చిత్తశుద్ధి, అంత విస్తృతమైన ఆలోచన పాలకులకెందుకు వుంటుంది.?
634338 162612It is hard to search out knowledgeable individuals on this topic, but you sound like you realize what youre speaking about! Thanks 638785
339262 603192Thanks for taking the time to discuss this subject. I really appreciate it. Ill stick a link of this entry in my blog. 935043
18625 271549jobs for high school students – Search for Jobs on our site, we provide several good links to the best and biggest Portals to finding a Job as a high school student! 398955
892607 657694I dont feel Ive seen all of the angles of this subject the way youve pointed them out. Youre a true star, a rock star man. Youve got so much to say and know so much about the subject that I think you should just teach a class about it 474807
185155 934522Id want to consult you here. Which isnt some thing Which i do! I enjoy reading a post that can make folks feel. Also, appreciate your allowing me to comment! 989192
81802 9559Audio began playing when I opened up this web site, so frustrating! 501740