ఈ మధ్య అందాల భామల ఆలోచనలు మారాయి .. ప్రస్తుతం క్రేజ్ తెచ్చుకోవాలంటే బికినితో బీచ్ లో హాట్ హాట్ పోజులిస్తే చాలు క్రేజ్ దానికదే రెట్టింపు అవుతుందని ఆలోచనతో బికినీలతో బీచ్ లలో నానా హంగామా చేస్తున్నారు. ఇప్పటికే బాలీవూడ్ లో పలువురు భామలు బికినీలతో ఓ రేంజ్ రచ్చ చేసి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సంచలనం రేపుతున్నారు. ఇప్పుడు ఇదే ఆలోచనను .. ఓ కుర్ర భామ ఫాలో చేసింది .. బికినితో బీచ్ లో రెచ్చిపోయి మరి ఫోటోలకు పోజులిచ్చింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడితే క్రేజ్ దానంతట అదే వస్తుందిలే అనుకుంది .. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది !! క్రేజ్ కాదు కదా .. నెటిజన్స్ నుండి ఘాటు విమర్శలు ఎదుర్కొంది !! కొందరైతే ఓ రేంజ్ లో బూతులు కూడా తిడుతున్నారు.. దాంతో షాక్ కు గురైంది ఈ అమ్మడు.
ఇంతకీ ఎవరా భామ అనేగా మీ డౌట్ .. ఆ వివరాల్లోకి వెళితే టివి నటి సుమోనా చక్రవర్తి గుర్తుందిగా, కపిల్ శర్మ షో తో పాటు ఏక్తా కపూర్ బడే అచ్చే లగ్తె హై లాంటి పాపులర్ టివి షో లలో పాల్గొన్న ఈ అమ్మడు తనకు మంచి క్రేజ్ రావాలన్న ఆలోచనతో థాయిలాండ్ వెకేషన్ లో ఓ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అసలే బికినిలో రెచ్చిపోయే రేంజ్ లో ఫోటోలకు పోజులిచ్చింది. ఆ ఫోటోలు చుసిన జనాలు దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు.
సుమోనా మరో పూనమ్ పాండే అవ్వాలని ప్రయత్నాలు చేస్తుందా .. లేక షెర్లిన్ చోప్రా లా ఈ వల్గర్ ఫోటోలు ఏమిటి ? బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంత బాగాలేదు. బట్టలు లేకుండా పోజులిస్తే పబ్లిసిటీ బాగానే ఉంటుంది. కానీ ఇలాంటి ఫోటలవల్లే కాస్టింగ్ కౌచ్ సంఘటనలు జరుగుతున్నాయి అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంకొందరైతే .. ఈ అమ్మడి పై బూతుల వర్షం కురిపిస్తున్నారు.
