గ్యాంగ్ లీడర్ ప్లాప్ తో నాని చాలా సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే చాలా మంది దర్శకులతో చర్చలు జరుపుతున్న నాని ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణతో వి సినిమాలో నటిస్తున్న నాని తాజాగా మజిలీ ఫేమ్ శివ నిర్వాణ తో మరో సినిమాకు ఓకే చెప్పాడు. టక్ జగదీశ్ పేరుతొ తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబందించిన ఓ పోస్టర్ ని విడుదల చేసారు.
ఈ సినిమా తరువాత నాని మరో దర్శకుడికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు రాహుల్ సాంకృత్యాన్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రాహుల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.
ఎందుకంటే కొత్త దర్శకుడికి రెండో సినిమా ఫెయిల్ అనే సెంటిమెంట్ టాలీవుడ్ లో ఉంది .. అందుకే నెక్స్ట్ సినిమా విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నారు. తాజాగా ఈ దర్శకుడు హీరో నానికి ఓ కథ చెప్పాడట .. కథ నచ్చింది కానీ కొంత ట్రీట్మెంట్ విషయంలో బాగాలేదని నాని చెప్పాడట .. దాంతో ఆ విషయంలో దర్శకుడు మార్పులు చేసి మళ్ళీ నానికి వినిపించాడట .. సో ఆ స్క్రిప్ట్ కు నాని ఓకే చెప్పాడని టాక్. సో టక్ జగదీశ్ సినిమా తరువాత నాని చేసే సినిమా ఇదే ఉంటుంది.
179581 356915Hello Guru, what entice you to post an write-up. This post was extremely intriguing, particularly since I was looking for thoughts on this topic last Thursday. 78690
601994 750865The next time Someone said a weblog, I hope that it doesnt disappoint me just as much as this. Come on, man, I know it was my choice to read, but When i thought youd have some thing intriguing to say. All I hear is truly a handful of whining about something you could fix inside the event you werent too busy searching for attention. 410175