Switch to English

2019 ఎన్నికల్లో సినీ తారల జిలుగులు !!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

సినిమాలకు, రాజకీయాలకు దగ్గరి సంబంధం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నవారు సినీ రంగంలోకి వస్తే .. ఎక్కువగా సినిమా రంగంలో ఉన్నవారు రాజకీయాల్లోకి వెళుతున్నారు. ఇది ఇప్పటిది కాదు నాటి నుండి జరుగుతున్న తంతు. తాజగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. మరి ఈ ఎన్నికల్లో పలువురు సినిమా తారలు ఎక్కువమంది పోటీ చేసారు .. మరి వారిలో గెలుపు గుర్రాలు ఎవరో .. ఓటమి పాలైంది ఎవరో చూద్దామా..

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో విజయం సాధించింది వైఎస్ఆర్సిపి. జగన్ నాయకత్వంలో రంగంలోకి దిగిన ఈ పార్టీ ఎవరు ఊహించని విధంగా 149 అసెంబ్లీ స్థానాలకు కైవసం చేసుకుంది. 25 లోక్ సభ స్థానాలతో దేశంలోనే నాలుగో మెజార్టీ పార్టీగా అవతరించింది. ఈ సారి ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి .. టిడిపి సైకిల్ పంచర్ అయింది. కేవలం 23 అసెంబ్లీ స్థానాలతో టిడిపి చావుతప్పి కన్ను లొట్టపోయినట్టుగా మారింది పరిస్థితి.

ఈ ఎన్నికల బరిలో ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ రెండో సారి హిందూపూర్ నియోజకవర్గం నుండి ఎం ఎల్ ఏ గా ఎన్నికయ్యారు. అయన మొదటి సారి అత్యధిక మెజారిటీతో హిందూపూర్ నుండి ఎన్నిక కావడం ఈ సారి ఆ మెజారిటీ కాస్త తగ్గింది. ఇక ఐరెన్ లెగ్ గా ఇమేజ్ తెచ్చుకున్న రోజా, తాను ఐరెన్ లెగ్ కాదని .. లక్కీ హ్యాండ్ అని ప్రూవ్ చేసుకుంది. నగరి బరిలో ఎంఎల్ఏ గా రెండో సారి విజయ కేతనం ఎగురవేసింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ ఈ సారి చాలా గట్టి పోటీ మధ్య విజయం సాధించి మళ్ళీ ఎంపీగా తన సత్తా చాటుకున్నారు. వైజాగ్ పార్లమెంట్ స్థానానికి ప్రముఖ నిర్మాత ఎం వివి సత్యనారాయణ పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. ఆయనతో పాటు ప్రముఖ సినీ ఫైనాన్సియర్ రఘురామా కృష్ణం రాజు నర్సాపురం ఎంపిక జెండా పాతాడు.

ఎన్టీఆర్ సన్నిహితుడైన కొడాలి నాని- వల్లభనేని వంశీ ఇద్దరు చెరో పార్టీలో పోటీ చేసి ఇద్దరు మంచి మెజారిటీతో విజయం సాధించారు. ఇక డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ సోదరులు కన్నబాబు కూడా ఈ సారి ఎంఎల్ ఏ గా ఎన్నికయ్యారు. పూరి జగన్నాధ్ సోదరుడు ఉమా శంకర్ గణేష్ ఇదివరకే రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఈ సారి గెలుపు గుర్రమెక్కాడు. అయన వై కాపా తరపున నిలబడ్డాడు. ఇక మెగా బ్రదర్ నాగబాబు మొదటి సారి ఎంపిక జనసేన తరపున పోటీ చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఓట్లు రాకపోవడంతో వైఫల్యం చెందాడు.

జనసేన పార్టీ స్థాపించి .. ప్రజలకోసమే అంటూ తన సినీ జీవితాన్ని త్యాగం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిస్థితి మరి దారుణంగా మారింది. అయన జనసేన పార్టీ తరపున ఈ ఎన్నికల్లో కేవలం ఒక సీటును మాత్రమే గెలుచుకోగా .. జనసేన అధినేత పవన్ మాత్రం రెండు నియోజక వర్గాలనుండి పోటీ చేసి ఓడిపోవడం జనసేన వర్గాల్లో తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇక మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి చూసుకుంటే కర్ణాటకలో మాజీ నటి సుమలత ఈ సారి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ప్రముఖ సినీ నటుడు అంబరీష్ మృతి చెందడంతో అయన స్థానంలో సుమలత పోటీ చేసింది. అలాగే కర్ణాటకలో సోలోగా బరిలోకి దిగిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఓటమిపాలయ్యారు.

యమదొంగ, శ్రీను వాసంతి లక్ష్మి, మహారథి లాంటి సినిమాల్లో నటించిన నవనీత్ కౌర్ ఈ సరి ఎన్నికలో ఎం ఎల్ ఏ అభ్యర్థిగా గెలిచారు. రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డిగా నటించిన భోజపురి నటుడు రవికిషన్ ఈ సారి బిజెపి తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. ఇంతకు ముందు అయన కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇక కర్ణాటకలో సుమలతకు పోటీగా ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ హీరోగా జాగ్వార్ సినిమాతో పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ హీరో సుమలతకు పోటీగా నిలబడి ఓటమిపాలయ్యారు. అలాగే బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిళ కూడా విజయం సాధించారు. ఈ లిస్ట్ లో ఇంకా చాలామంది ఉన్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....