మంచు మోహన్ బాబు ఈమద్య కాలంలో సినిమాల సంఖ్య చాలా తగ్గించాడు. తనకు తగ్గ పాత్రలు రాకపోవడంతో సినిమాలు చేసేందుకు ఆయన ఆసక్తి చూపడం లేదు. సూర్య హీరోగా నటించిన ఆకాశమే నీ హద్దు లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమా తర్వాత మోహన్ బాబు ఒక మలయాళ సినిమాను రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా మాకు ఎక్స్‌క్లూజివ్ సమాచారం అందింది. మలయాళ మూవీ ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వర్షన్ 5.25’ ను తెలుగులో రీమేక్ చేసేందుకు గాను సిద్దం అయ్యాడు.
ఇటీవలే ఈ సినిమాను తెలుగులో ‘ఆండ్రాయిడ్ కట్టప్ప’ అంటూ డబ్బింగ్ చేసి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. చూసిన వారు ప్రశంసించారు. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమాను మోహన్‌బాబు చూశాడేమో రీమేక్ చేయాలని సిద్దం అయ్యాడు. గత ఏడాది మలయాళి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ గా కూడా మంచి ఫలితాన్ని చవి చూసింది. అందుకే ఈ సినిమాను తెలుగులో ఆహా లో డబ్ చేసి విడుదల చేశారు.
తెలుగు ప్రేక్షకుల అభిరుచికి కాస్త భిన్నంగా ఉన్నా కూడా కొందరు ఈ సినిమాను నచ్చుతారు. కమర్షియల్ ఎంటర్ టైనర్ కాకున్నా ఒక మంచి మెసేజ్ తో పాటు మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా అవ్వడం వల్ల మోహన్ బాబు ఈ సినిమాను చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అతి త్వరలోనే ఈ రీమేక్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ రీమేక్ ను మోహన్ బాబు సొంతంగా నిర్మించబోతున్నాడట. దర్శకత్వం ఎవరు చేస్తారు అనేది చూడాలి. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమా రీమేక్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాట. ఒక ఒంటరి వృద్దుడికి సాయంగా ఉండే రోబోకు మద్య సాగే కథ ఈ సినిమా.
మెషన్ అంటేనే నచ్చని ఆ వృద్దుడు కొడుకు తెచ్చిన రోబోను మొదట కాదని ఆ తర్వాత దానికి బానిస అయ్యాడు అనేది సినిమా కథ. రోబో కోసం ఏకంగా కొడుకును సైతం వదులుకునేందుకు సిద్దం అయ్యే వృద్దుడి పాత్రలో మోహన్ బాబు కనిపించే అవకాశం ఉంది. మోహన్ బాబుకు తగ్గ పాత్ర అది అనడంలో సందేహం లేదు. ఖచ్చితంగా మోహన్ బాబు ఈ రీమేక్ తో మంచి కమ్ బ్యాక్ అవుతాడు అనిపిస్తుంది.
967736 627451Good blog here! right after reading, i decide to buy a sleeping bag ASAP 695166
224772 334609Simply a smiling visitor here to share the adore (:, btw outstanding style . “Audacity, a lot more audacity and always audacity.” by Georges Jacques Danton. 624751
362373 924231I surely enjoyed the method that you explore your experience and perception with the location of interest 802916
794744 602017You produced some decent points there. I looked online to the problem and discovered most people is going in addition to using your website. 545370