Switch to English

మెగా ఫ్యాన్స్‌కి ‘సైరా’ షాకింగ్‌ అప్‌డేట్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఈ ఏడాది విడుదల కానున్న రెండు ప్రతిష్టాత్మకమైన సినిమాల్లో ఒకటి ‘సాహో’ అయితే, ఇంకొకటి ‘సైరా నరసింహారెడ్డి’. ‘బాహుబలి’ సిరీస్‌ తర్వాత మరో సంచలనానికి ‘సాహో’తో హీరో ప్రభాస్‌ సిద్ధమవుతున్న విషయం విదితమే. ‘సాహో’ సినిమాపై భారీ అంచనాలతోపాటు, కొన్ని ఆందోళనలు కూడా వున్నాయి అభిమానులకి. ‘బాహుబలి’ విషయానికొస్తే, అక్కడ రాజమౌళి వున్నాడు.. ‘సాహో’ సినిమాకి ప్రభాస్‌ మాత్రమే ‘కీ’ పాయింట్‌. అయినాసరే, పెరుగుతున్న అంచనాలు, విడుదలవుతున్న ప్రోమోస్‌.. ఇవన్నీ చూస్తే, ‘సాహో’ తెలుగు నాట మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించడం ఖాయమని అంతా అనుకుంటున్నారు.

మరోపక్క, ‘సైరా నరసింహారెడ్డి’ పరిస్థితి కాస్త భిన్నంగా కన్పిస్తోంది. మొదటి నుంచీ ‘సైరా’ సినిమా విషయంలో కొంత ‘డిలే’ సుస్పష్టం. ఈపాటికే ‘సైరా’ విడుదలవ్వాల్సి వుండగా, షూటింగ్‌ సందర్భంగా తలెత్తుతున్న సమస్యలు, ఇతరత్రా కారణాలతో ఈ ప్రెస్టీజియన్‌ ప్రాజెక్ట్‌ కాస్త ఆలస్యమయ్యింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 దసరా సమయానికి సినిమా విడుదల చేస్తామని నిర్మాత రామ్‌చరణ్‌ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే, పరిస్థితులు ఏమంత సానుకూలంగా కన్పించడంలేదు ‘సైరా నరసింహారెడ్డి’కి.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ‘సైరా’ సినిమా విడుదలని 2020కి పోస్ట్‌ పోన్‌ చేశారని తెలుస్తోంది. షూటింగ్‌ పార్ట్‌ దాదాపు పూర్తయిపోయినా, సినిమా కోసం అద్భుతమైన గ్రాఫిక్స్‌ ప్లాన్‌ చేసిన దరిమిలా, అది కాస్త ఆలస్యమయ్యేలా వుందట. నిజానికి షూటింగ్‌తోపాటుగానే పోస్ట్‌ ప్రొడక్షన్‌కి సంబంధించి కొన్ని పనులు శరవేగంగా జరుపుతూ వచ్చారట. ఎంత కష్టపడ్డా, గ్రాఫిక్స్‌ పనులంటే అంత తేలిగ్గా అయ్యేవి కావు. పైగా, ఫైనల్‌ ఔట్‌పుట్‌ దగ్గరకు వచ్చేసరికి, చిన్న చిన్న మార్పులు, చేర్పులుంటాయి. వాటిని సరిచేయడానికి ఎక్కువ టైమే పడ్తుంది.

ఈ నేపథ్యంలో ముందుగానే అలర్ట్‌ అయిన నిర్మాత రామ్‌చరణ్‌, సినిమాని పోస్ట్‌పోన్‌ చేస్తే ఎలా వుంటుంది.? అన్న అభిప్రాయాన్ని అటు చిరంజీవితోనూ, ఇటు దర్శకుడితోనూ పంచుకున్నాడట. మరోపక్క, ‘సైరా’ టీమ్‌ తరఫున ఇంతవరకు ఈ ప్రచారంపై ఎలాంటి అఫీషియల్‌ డిక్లరేషన్‌ రాలేదు. పక్కా ప్లానింగ్‌తోనే దర్శకుడు సురేందర్‌రెడ్డి, రామ్‌చరణ్‌ సినిమా పనుల్ని పరుగులు పెట్టిస్తున్నారనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికే వస్తుందన్న మాటకే ‘సైర్‌’ టీమ్‌ కట్టుబడి వుందనీ ఇంకో వాదన బలంగా విన్పిస్తోంది. ఇంతకీ ‘సైరా’ వాయిదా పడుతోందన్న గాసిప్‌ నిజమేనా? వేచి చూడాల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...