ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద మరోమారు సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ మహిళా నేత వంగలపూడి అనిత, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇంతకీ, ఆ వీడియో సారాంశమేంటంటే.. తాగు, సాగు నీటి కోసం మెడికల్ హాస్పిటల్స్ కట్టాలట. అలాగని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారట. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలాంటి చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు.
టీడీపీ మాత్రమే కాదు, జనసేన సహా ఇతర విపక్షాలు.. సదరు వీడియో మీద బీభత్సమైన ట్రోలింగ్ చేసేస్తున్నాయి. ‘అబ్బే, అది మార్ఫింగ్ వీడియో..’ అంటున్నారు కొందరు బులుగు కార్మికులు. ‘మా జగనన్న ఆలోచన వేరు..’ అంటూ తాగు, సాగు నీటి కోసం మెడికల్ హాస్పిటల్స్ కట్టడం గురించి చిత్ర విచిత్రమైన లాజిక్కుల్ని మరికొందరు వైసీపీ మద్దతుదారులు వెతుకుతున్నారు.
మెడికల్ హాస్పిటల్స్ (గిదేందయ్యా ఈ కొత్త పైత్యం అనుకోవద్ద.. అది వేరే కథ) కింద.. అంటే, భూ గర్భంలో స్మశానాలు ఏర్పాటు చేస్తారట. అక్కడి నుంచి చిత్ర విచిత్రమైన కెమికల్ చర్యల ద్వారా నాణ్యమైన మంచి నీరు తీసుకొస్తారట. అలాగని, ఓ వాట్సాప్ యూనివర్సిటీ క్రియేటివిటీని జనం మీదకు వదిలేస్తున్నారు బులుగు కార్మికులు.
‘నా ఆంధ్రప్రదేశ్ మరీ ఇంత దుస్థితిలోకి ఎలా వెళ్ళిపోయింది.?’ అంటూ, ప్రవాసాంధ్రులు కన్నీరుమున్నీరవుతున్నారంటే, ఆ స్థాయి క్రియేటివిటీ, సాంకేతికత.. మన రాజకీయాల్లో పుట్టుకొచ్చింది మరి. ఈ వ్యవహారంపై అధికార పార్టీ అధికారికంగా స్పందిస్తుందా.? ‘ఫ్యాక్ట్ చెక్..’ అంటూ వివరణ ఏమైనా వస్తుందా.?
అయినా, మెడికల్ హాస్పిటల్స్ ఏంటి మన ఖర్మ కాకపోతే.? తాగు, సాగు నీటి కోసం ప్రాజెక్టులు కట్టాల్సింది పోయి, మెడికల్ హాస్పిటల్స్ కడతామనడమేంటి.? ఏంటో.. ఇది కలియుగం అని తెలుసుగానీ, ఇంత కలగాపులగం ఇందులో వుంటాయని ఎవరైనా ఊహించారా.?
58600 946729Some truly nice and utilitarian information on this web web site , likewise I think the style and style holds great functions. 201820
808740 636364I truly treasure your piece of function, Fantastic post. CHECK ME OUT BY CLICKING MY NAME!!! 169413
680838 371444Howdy! I just wish to give a huge thumbs up for the wonderful info you may have here on this post. I will probably be coming back to your weblog for a lot more soon. 609940