బీజేపీకి షాక్ ఇచ్చిన చిరంజీవి.. తమ్ముడు పవన్ కళ్యాణ్‌ని పక్కన పెట్టి, వైఎస్ జగన్ దారిలో మెగాస్టార్ చిరంజీవి పయనం.. తమ్ముడికి భవిష్యత్తులో రాజకీయంగా ఎలాంటి సమస్యలూ వుండకూడదన్న కోణంలో డ్యామేజీ కంట్రోల్ చర్యల్లో భాగంగా కదిలిన చిరంజీవి.. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉక్కు ఉద్యమానికి మద్దతు పలికిన తర్వాత వ్యూహాత్మకంగా అడుగులేసిన చిరంజీవి.. సినీ పరిశ్రమను ఒక్క ట్వీట్‌తో ఇరకాటంలో పడేసిన చిరంజీవి.. ఇలా ఎన్నెన్నో విశ్లేషణలు బయల్దేరాయి మెగాస్టార్ చిరంజీవి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు పలుకుతూ ట్వీటెయ్యగానే.
మెగాస్టార్ చిరంజీవి, గతంలో ఓ రాజకీయ పార్టీకి అధినేత. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి వ్యక్తికి ఆయా అంశాల పట్ల అవగాహన వుండదా.? స్పందించాలనే ఆలోచన వుండకూడదా.? ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, రాజకీయాలకు దూరంగా వున్నారు. అయితే, తనను అభిమానించేవారు ఆయా అంశాలపై స్పందించాలని కోరుతుంటే, వాటి పట్ల స్పందించడానికి సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్నారు చిరంజీవి. ఈ కారణంగానే ఆయన సోషల్ మీడియాలోకి వచ్చారు.
మూడు రాజధానుల వ్యవహారంలో వైఎస్ జగన్ ఆలోచనకు మద్దుత పలకగానే, అమరావతిలో చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు షురూ అయ్యాయి. ‘ఒకే ఒక్క రాజధాని అమరావతి’ అని పవన్ అన్నారుగా.. చిరంజీవి తన తమ్ముడిని లెక్కచేయడంలేదా.? అని విశ్లేషించారు. అది చిరంజీవి వ్యక్తిగత అభిప్రాయం. విశాఖ ఉక్కు విషయంలో కూడా అంతే.
అయినా, బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలూ (ఆంధ్రపదేశ్‌కి సంబంధించినంతవరకు) విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకమనే అంటున్నాయి. ఇందులో చిరంజీవి ఏ రాజకీయ పార్టీకి అయినా వ్యతిరేకంగా కామెంట్ చేశారని ఎలా అనుకోగలం. చిరంజీవి అంటే చాలా కొద్ది మందికి నచ్చదు. వారి చేతుల్లో బలమైన మీడియా వుంది. ఇకనేం, చిరంజీవి కావొచ్చు.. చిరంజీవి కుటుంబం నుంచి కావొచ్చు, ఎవరు ఏం మాట్లాడినా అందులో లేని దురుద్దేశాన్ని వెతకడమే సదరు మేదావుల పని.
510084 419519I appreciate you taking the time to create this post. It has been genuinely valuable to me definitely. Value it. 534595
256894 154997While you are any with the lucky enough choices, it comes evidently, although capture the fancy of the particular coveted by ly folks other valuable you you meet could possibly nicely have hard times this certain difficulty. pre owned awnings 473666
970934 398716Really informative and fantastic bodily structure of content material , now thats user friendly (:. 267461
966112 461212As I internet site owner I believe the articles here is truly wonderful , thankyou for your efforts. 944785