Switch to English

మంగళగిరి గెలవాల్సిందే.. ‘అర్థ’మైందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మంగళగిరి స్థానంలో ఎలాగైనా గెలవాలని పావులు కదుపుతోంది. అక్కడ నుంచి ఏపీ సీఎం తనయుడు, మంత్రి నారా లోకేశ్ బరిలో ఉండటంతో గెలుపే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

ఇందుకోసం అవకాశం ఉన్న ఏ మార్గాన్నీ విడిచిపెట్టడంలేదు. గెలుపుపై ధీమా ఉన్నప్పటికీ, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పరిస్థితి మారిపోతుందేమోననే ఉద్దేశంతో అక్కడ అన్ని సేనలనూ మోహరిస్తోంది. ఇప్పటికే లోకేశ్ మంగళగిరి బరిలో ప్రచారంలో దూసుకుపోతుండగా.. బ్యాక్ గ్రౌండ్ లో కూడా అందుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి.

వాస్తవానికి లోకేశ్ పోటీ చేస్తాడని భావించిన నియోజకవర్గాల జాబితాలో తొలుత మంగళగిరి లేదు. అయితే, అనూహ్యంగా ఆయన్ను మంగళగిరి బరిలో దింపుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంతం కావడం.. అక్కడ ఐటీ కంపెనీలు రావడం.. అభివృద్ధి కనబడటం వంటి కారణాలతో లోకేశ్ గెలుపు సులభం అవుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.

పైగా ఆయన చేయించిన సర్వేల్లో సైతం సానుకూల ఫలితం రావడంతో తనయుడిని అక్కడే బరిలోకి దింపాలని నిర్ణయించారు. లోకేశ్ సైతం తనకు టికెట్ ఖరారు కాగానే రంగంలోకి దిగిపోయారు. ఆ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ గంజి చిరంజీవి ఇంటికి వెళ్లి మద్దతు కోరారు. ఆయనకు కొన్ని హామీలిచ్చి అసంతృప్తి లేకుండా చూసుకున్నారు.

అయితే, వైఎస్సార్ సీపీ తరఫున అక్కడ పోటీ చేస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా గట్టి అభ్యర్థే. ఆర్థికంగా టీడీపీతో పోటీ పడలేకపోయినా, అంగబలంలో మాత్రం ఆళ్లను తక్కువ అంచనా వేయక్కర్లేదు. నియోజకవర్గంలో దాదాపు ప్రతి కుటుంబంతోనూ మమేకమైన వ్యక్తిగా ఆళ్లకు మంచి పేరుంది.

వైఎస్సార్ క్యాంటీన్ పేరుతో రూ.4కే పేదలకు భోజనం పెడుతున్న ఆళ్ల మీద స్థానికులకు మంచి అభిప్రాయమే ఉంది. సదావర్తి భూముల కుంభకోణంలో కోర్టులో పోరాడి స్థానికంగా ఆయన హీరో కూడా అయ్యారు. పైగా గత ఎన్నికల్లో తెలుగుదేశం అనుకూల పవనాలు ఉన్న సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి 12 ఓట్ల తేడాతో గెలుపొందారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం లోకేశ్ వర్సెస్ ఆళ్ల ఫైట్ టఫ్ గానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. పైగా చరిత్ర చూస్తే మంగళగిరిలో తెలుగుదేశానికి అత్యంత చెత్త రికార్డు ఉంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టులే గెలుస్తూ వచ్చారు. టీడీపీ ఆవిర్భవించిన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ ఆ పార్టీ విజయం సాధించింది. తర్వాత కమ్యూనిస్టులకు ఈ స్థానం కంచుకోటలా ఉంటూ వచ్చింది. గత ఎన్నికల్లో మాత్రం వైఎస్సార్ సీపీ గెలిచింది. ఈ

పరిస్థితుల్లో ఈ సారి ఇక్కడ ఎలాగైనా గెలిచి తీరాలని టీడీపీ భావిస్తోంది. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి పని చక్కబెట్టుకుంటూ వస్తోంది. చోటా మోటా నాయకులందరినీ తనవైపు తిప్పుకునే పని ప్రారంభించింది. ఇప్పటికే అలాంటివారందరినీ గుర్తించి తాయిలాలు ముట్టజెప్పినట్టు సమాచారం.

ఒక్క రాత్రే ఏకంగా రూ.15 కోట్ల మేర పంపకాలు జరిగినట్టు చెబుతున్నారు. స్థాయిని బట్టి వారికి ప్రత్యేక హామీలు, తక్షణ నగదు బహుమతులు భారీ ఎత్తున ముట్టజెప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అధికారంలోకి వస్తే చిన్న చిన్న కాంట్రాక్టులు వంటివన్నీ ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.

ఎంత ఖర్చుపెట్టైనా సరే లోకేశ్ ను గెలిపించడానికి తెలుగుదేశం పెద్దలు పావులు కదుపుతున్నారు. ఎంత ఖర్చు అయిన పర్వాలేదు.. మంగళగిరి మాత్రం గెలివాల్సిందే అని స్థానిక నేతలకు ఆదేశాలు జారీచేసేశారు. ఈ నియోజకవర్గంలో అతిపెద్ద కమ్యూనిటీగా ఉన్న చేనేతల ఓట్లే ఫలితాన్ని నిర్ణయిస్తాయి. వారంతా టీడీపీపై వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఆళ్ల గెలుస్తారా? లేక లోకేశ్ విజయం సాధిస్తారా అనేది ఉత్కంఠగా మారింది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

రాజకీయం

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

ఎక్కువ చదివినవి

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...