హీరో మంచు మనోజ్ గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా వుంటున్నాడు. నిజానికి ‘గుంటూరోడు’, ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాలతో మొత్తంగా నటనకు గుడ్ బై చెప్పేద్దామనుకున్నాడు. ఆ విషయాన్ని బహిరంగా ప్రకటించిన మంచు మనోజ్, ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్న విషయం విదితమే. అయితే, సినిమాలకు దూరంగా జరిగి.. ఆ మాటకొస్తే, హైద్రాబాద్‌కి కూడా కొంతకాలం దూరమైపోయాడు మనోజ్. ఎందుకిలా.? అన్న ప్రశ్నకు సమాధానం కాస్త లేటుగా దొరికింది.
పెళ్ళి తర్వాత కొన్నాళ్ళు సాఫీగానే సాగిన మనోజ్ వైవాహిక జీవితం, ఆ తర్వాత కొన్ని సమస్యల్ని ఎదుర్కొందట. ఆ సమస్యలకు పరిష్కారం దొరక్కపోవడంతో చివరికి తాము విడిపోయామని ఈ రోజు సాయంత్రం ప్రకటించాడు మంచు మనోజ్. విడిపోయినా తామిద్దరం ఒకర్ని ఒకరు గౌరవించుకుంటామంటూ మనోజ్ సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు.
మరోపక్క, ఈ సమస్య కారణంగా సినిమాలకు దూరమయ్యాననీ, ఇకపై సినిమాల్లో కొనసాగుతానని మంచు మనోజ్ ప్రకటించడం గమనార్హం. అంటే, మనోజ్ నుంచి త్వరలోనే సినిమా న్యూస్ వినబోతున్నామన్నమాట. తనంతట తానుగా ఓ స్క్రిప్ట్‌ని మనోజ్ సిద్ధం చేసుకున్నాడనీ, త్వరలో సినిమా అనౌన్స్ చేయబోతున్నాడనీ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారమే నిజమయ్యేలా వుంది.
మొత్తమ్మీద, మనోజ్.. తన మనసులో ఇప్పటిదాకా దాచుకున్న ఓ సీక్రెట్‌ని బయటపెట్టేశాడన్నమాట.. అదీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి. మనోజ్ ఇచ్చిన వివరణ పట్ల స్పందించిన అభిమానులు, ఇకపై కెరీర్లో విజయవంతంగా దూసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నారు. మనోజ్ జెన్యూనిటీకి అభిమానులు ఫిదా అవుతున్నారు.
679257 92869dude this just inspired a post of my own, thanks 379334
82392 273416Respect to internet site author , some very good selective info . 329957
376595 490995very good post, i certainly adore this internet site, go on it 339984
863437 418859You wouldnt feel it but Ive wasted all day digging for some articles about this. You may be a lifesaver, it was an outstanding read and has helped me out to no finish. Cheers! 793732