ఏదైనా ఇష్యూ మీద స్పందించడంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుంటారు. గతంలో ఎన్నో సార్లు సమాజంలో జరిగిన అన్యాయాల పట్ల స్పందించిన మహేష్, ఇటీవలే అమెరికాలోని నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లయిడ్ అనే వ్యక్తిని పోలీసులు చంపేయడంతో అమెరికాతో పాటు యావత్ ప్రపంచం భగ్గుమన్న విషయం తెల్సిందే. సూపర్ స్టార్ మహేష్ కూడా ఈ విషయంలో స్పందించాడు. #noblacktuesday హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ వేసాడు. ఇప్పుడు అదే మహేష్ కు చిక్కులు తెచ్చింది.
మహేష్ కలర్ గురించి, అందం గురించి సినిమాల్లో ప్రస్తావన తరుచుగా వస్తూ ఉంటుంది. ఇక హీరోయిన్ కంటే తన అందంగా ఉన్నట్లు కొన్ని సీన్లు మహేష్ సినిమాల్లో ఉంటాయి. అతడులో త్రిషతో పెద్ద కలర్ కూడా కాదు కదా అనే డైలాగ్ ఉంటుంది. అలాగే దూకుడులో సమంత, నీ కలరేంటి, నా కలరేంటి అని అంటాడు. ఇటీవలే సరిలేరు నీకెవ్వరులో కూడా “మిల్క్ బాయ్ తో పెళ్లి” అని డైలాగ్ పాపులర్ అయింది.
ఇలా సినిమాల్లో కలర్ కు ప్రాముఖ్యతను ఇచ్చి ఇప్పుడు అలాంటివి ఉండకూడదన్నట్లు మాట్లాడడం హైపోక్రసీకి నిదర్శనమని ఇప్పుడు కొందరు మహేష్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. మహేష్ అనే కాదు ఈ విషయంలో స్పందించిన సెలబ్రిటీలు కొందరు నిజ జీవితంలో ఫెయిర్ నెస్ బ్రాండ్స్ కు ప్రచారకర్తలుగా ఉండడంతో వాళ్లకు కూడా బ్యాండ్ పడిపోయింది.
#BlackOutTuesday pic.twitter.com/mRPfgI3ecG
— Mahesh Babu (@urstrulyMahesh) June 2, 2020
95766 261898great post. Neer knew this, regards for letting me know. 837423
359759 556666Some actually good articles on this internet site , thankyou for contribution. 997852