సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన మహర్షి సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుని మహేష్ క్రేజ్ ఏమిటో మరోసారి చాటి చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైన ఈ సినిమా బాహుబలి రికార్డులను క్రాస్ చేస్తుందని అనుకున్నారు. కానీ ఆ రేంజ్ వసూళ్లను రాబట్టలేక చతికిల పడింది మహర్షి.
విడుదలైన మూడు రోజుల్లో మంచి దూకుడు ప్రదర్శించిన మహర్షి ఆ తరువాత స్లోగా వసూళ్లు డీలా పడుతున్నాయి. అయితే నైజంలో మాత్రం బాహుబలి పార్ట్ 1 ను మహర్షి క్రోస్ చేయడం విశేషం.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మొదటి భాగం ఒక్క నైజంలోనే మొదటి రోజు 6 కోట్లు వసూళ్లను అందుకుని ఎవరికీ అందని రికార్డును నెలకొల్పింది. ఆ తరువాత ఆ రికార్డును బాహుబలి 2 కొట్టేసింది అది వేరే విషయం.
అయితె నాన్ బాహుబలి కేటగిరిలో మహర్షి నైజాంలో మొదటి రోజు ఏకంగా 6.38 కోట్ల వసూళ్లను అందుకుని బాహుబలి 1 కు చెక్ పెట్టాడు మహర్షి. అయితే మిగతా ఏరియాల్లో కూడా బాహుబలి మొదటి భాగానికి చెక్ పెడతారని అనుకున్నారు కానీ అది వర్కవుట్ కాలేదు. మొత్తానికి మహర్షి సినిమాకు మిక్సెడ్ టాక్ రావడంతో పాటు భారీగా పెరిగిన టికెట్స్ రేట్స్ కూడా సినిమా వసూళ్లపై భారీ ప్రభావాన్ని చూపించింది. మరి ఈ లెక్కన మహర్షి ఏ రేంజ్ సక్సెస్ ని అందుకుంటాడా అన్న టెన్షన్ మహేష్ అభిమానుల్లో ఉంది.