పవన్ కళ్యాణ్ వరుసగా మూడు సినిమాలకు కమిట్ అయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ రీమేక్ కు వకీల్ సాబ్ అంటూ టైటిల్‌ను ఖరారు చేయడంతో పాటు ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. పవన్ స్టామినా ఏంటో కూడా ఆ ఫస్ట్‌లుక్ చెప్పకనే చెప్పింది. వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే పూర్తి అవ్వబోతుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ముందుగా అనుకన్న ప్రకారం అయితే మార్చి మొదటి వారంలోనే షూటింగ్ పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా ఒకటి రెండు వారాలు అదనంగా తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. పవన్ రాజకీయ కార్యక్రమాలు మరియు ఇతరత్ర కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతుందని సమాచారం అందుతోంది. ఇక ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో పవన్ నటించాల్సి ఉంది. మొదటి షెడ్యూల్ ను పవన్ లేకుండానే పూర్తి చేసిన క్రిష్ గత కొన్ని రోజులుగా పవన్ కోసం ఎదురు చూస్తున్నాడట.
పవన్ ముందే డేట్లు ఖచ్చితంగా ఇవ్వలేక పోయాడు. వీలున్నప్పుడు తాను షూటింగ్ కు హాజరు అవుతాను అని.. షూటింగ్ హాజరు అయ్యేందుకు రెండు మూడు రోజుల ముందు చెప్తానంటూ క్రిష్ కు సూచించాడట. ప్రస్తుతం పవన్ నుండి సిగ్నల్ కోసం క్రిష్ ఎదురు చూస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. వీరిద్దరి కాంబో మూవీ పీరియాడిక్ డ్రామాగా ఉంటుందని.. రాజుల కాలంలో దొంగగా అది కూడా ఒక మంచి దొంగగా పవన్ కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
485145 65202Maintain up the fantastic function , I read few blog posts on this website and I believe that your internet site is real interesting and has bands of good information . 399697
335976 118425I like the way you conduct your posts. Have a good Thursday! 650617
826908 880837Usually I do not read post on blogs, nevertheless I would like to say that this write-up really forced me to check out and do so! Your writing taste has been surprised me. Thank you, quite wonderful post. 162381
733388 606737You created some decent points there. I looked on the net for any dilemma and located most individuals goes along with together with your website. 857790