మంత్రి కొడాలి నాని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఇటీవల ప్రత్యేకంగా భేటీ అయ్యారట. రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి కాదట. అమరావతిని దెబ్బ తీయడానికట. ‘అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దు..’ అంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని, తాజాగా అదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారట. ‘అందరితో చర్చించి నిర్ణయం తీసుకుందాం..’ అని కొడాలి నానికి, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బదులిచ్చారట.
అక్కడికేదో, రాష్ట్రానికి మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర ప్రజలందరితోనూ, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతోనూ చర్చించినట్లు.. ఇప్పుడు శాసన రాజధాని కూడా అమరావతిలో వుండకూడదనే విషయాన్ని కూడా ‘అందరితోనూ చర్చించేస్తారు’ అని మనం అనుకోవాలేమో.! నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్లుంది వ్యవహారం. ముఖ్యమంత్రి మారిన ప్రతిసారీ రాజధాని మార్చుకుంటూ పోతే, అసలుంటూ ఆంధ్రప్రదేశ్‌కి ఇంకో పాతికేళ్ళ తర్వాత అయినా సరైన రాజధాని వుంటుందా.?ఛాన్సే లేదు. రాష్ట్రానికి అభివృద్ధి చెందిన రాజధాని అత్యవసరం. కానీ, గడచిన ఆరేళ్ళలో రాజధాని చుట్టూ చాలా చాలా రాజకీయాలు జరిగాయి.. జరుగుతూనే వున్నాయి తప్ప, రాష్ట్రానికి ఆదాయాన్నిచ్చే సరైన రాజధాని నగరం లేకుండా పోయింది.
అభివృద్ధి అనేది మచ్చుకైనా కనిపించని ఆంధ్రప్రదేశ్‌లో గడచిన ఆరేళ్ళుగా ‘కుల రాజకీయాల్ని’ చూస్తున్నాం.. ‘మత రాజకీయల్ని’ చూస్తున్నాం.. ‘ప్రాంతాల పేరుతో’ రాజకీయాల్ని చూస్తున్నాం. పొరుగు రాష్ట్రాలేమో అభివృద్ధిలో దూసుకెళుతోంటే, ఆంధ్రప్రదేశ్ మాత్రం నానాటికీ దిగజారిపోతూ వస్తోంది. అయినా, ఈ నిస్సిగ్గు రాజకీయాలు మాత్రం మారడంలేదు. ‘పేదలకు ఇళ్ళ స్థలాలు రాజధానిలో ఇవ్వలేనప్పుడు..’ అంటూ అర్థరహితమైన ఓ వాదన పట్టుకొచ్చి కొడాలి నాని, అసలు అమరావతిలో శాసన రాజధాని కూడా వుండకూడదని అంటున్నారు.
మరి, అభివృద్ధిలో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేస్తోన్న ప్రభుత్వాల్ని ప్రజలు వద్దనుకుంటే ఏంటి పరిస్థితి.? అధినేత భజనలో మునిగి తేలడం తప్ప, ప్రజల గురించి, రాష్ట్రం గురించి ఆలోచించని రాజకీయ నాయకులున్నన్నాళ్ళూ ఆంధ్రప్రదేశ్ దుస్థితి ఇలాగే తగలడుతుంది.
344072 860238I need to admit that that is one fantastic insight. It surely gives a company the opportunity to have in about the ground floor and really take part in creating a thing particular and tailored to their needs. 667784
275915 606256Outstanding post, I conceive individuals should larn a lot from this weblog its really user friendly . 118394
328703 660994Right after examine a couple of of the weblog posts on your site now, and I actually like your way of blogging. I bookmarked it to my bookmark internet site list and shall be checking once again soon. Pls try my internet site online as effectively and let me know what you think. 959952
242102 666829Its very good as your other content material : D, appreciate it for posting . 979447