అఖిల్ హీరోగా వచ్చిన హలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ భామ కళ్యాణి ప్రియదర్శిని తాను ప్రేమలో ఉన్నానంటూ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హలొ తరువాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో నటించిన చిత్రలహరి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కళ్యాణి ప్రస్తుతం ఓ తెలుగు సినిమా చేస్తుంది. అటు కోలీవుడ్ లోకూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిన ఈ అమ్మడు ప్రేమలో మునిగిపోయిందంటూ తెగ వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె అయినా కళ్యాణి ని ప్రేమలో పడేసిన అబ్బాయి ఎవరో తెలుసా .. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్. కళ్యాణి, ప్రణవ్ ఇద్దరు కూడా కాలేజ్ డేస్ నుండే మంచి స్నేహం ఉంది .. అది ఇప్పుడు ప్రేమగా మారింది. పైగా ఈ రెండు కుటుంబాలమధ్య సత్సంబందాలున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కళ్యాణి కి మీరు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. దీని గురించి మీరేమంటారు అని అడిగితె .. మీరు చెప్పింది నిజమే. నేను గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. పైగా తన ప్రేమ వ్యవహారం తన పేరెంట్స్ కు కూడా తెలుసు అని చెప్పింది. అయితే అతగాడు ఎవరన్నది మాత్రం ఇప్పుడు చెప్పను అని షాకిచ్చింది కళ్యాణి !!
66276 346810Any way Ill be subscribing to your feed and I hope you post once again soon. I dont think I could have put it greater myself. 478595