Jhanvi Kapoor: ఆమెను చూస్తూ అందమే అసూయపడుతుందా..? అందమే ఆమెకు దాసాహమైందా..? అందంలోకే ఈమె ప్రవేశించిందా..? బాలీవుడ్ బ్యూటీ, శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీని చూస్తే ఇవే అనుమానాలు రాకమానవు. డిస్నీ హాట్ స్టార్ లో ‘ది లిటిట్ మెర్మెయిడ్ (మత్స్యకన్య)’ అంటూ సినిమాకు సంబంధించి చిన్న టీజర్ లో ఆమె మత్స్యకన్యగా మెరిసిపోతోంది.
ఇద్దరు చిన్నారులకు ‘మచ్లీ జల్ కి రాణీ హై’.. అంటూ ఓ పద్యం వారికి వివరిస్తుంది. జలకన్య గురించి చిన్నారులకు చెప్తూ.. ఆ జలకన్య నీటి నుంచి వస్తే.. అని సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. చిన్నారులు.. బాహర్ నికలాతో.. అనగానే జాన్వీ మత్స్యకన్యలా మారిపోయిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. ఇందులోని గ్రాఫిక్స్ అలరిస్తున్నాయి.
జన్వీ మత్స్యకన్యలా మెరిసిపోతుంటే.. మళ్లీ జగదేకవీరుడు అతిలోకసుందరిలో శ్రీదేవి ఇలా జాన్వీ రూపంలో వచ్చిందా.. మత్స్యకన్యే జాన్వీలోకి మారిపోయిందా.. నిజంగా మత్స్యకన్యే ఇంత అందంగా ఉంటుందా అన్నట్టు ఆకుపచ్చ డ్రెస్సింగ్ లో జాన్వీ అందాన్ని వర్ణించాలంటే కవులే కొత్త పదాలు రాయాలేమో..!