Switch to English

Janasena: లెక్కలు తేలుతున్నాయ్.! జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతమే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,378FansLike
57,764FollowersFollow

24 అసెంబ్లీ, మూడు లోక్ సభ టిక్కెట్ల నుంచి 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ టిక్కెట్ల దాకా సర్దుకుపోవాల్సి వచ్చింది జనసేన పార్టీ, టీడీపీ – బీజేపీలతో పొత్తు కారణంగా. సరే, పొత్తుల రాజకీయాల్లో ఈ సర్దుపోట్లు మామూలే.!

ఎన్ని సీట్లలో పోటీ చేశామన్నది ముఖ్యం కాదు, ఎంత స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించామన్నదే ముఖ్యమన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నమాట. ‘వ్యూహం నాకు వదిలెయ్యండి..’ అని జనసేనాని చేసిన, చేస్తున్న వ్యాఖ్యలపై కొన్ని పెదవి విరుపులు సహజంగానే వస్తున్నాయ్.

రాజకీయ ప్రత్యర్థుల నుంచి హీనాతి హీనమైన కామెంట్లను భరిస్తూ కూడా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘రాష్ట్రం కోసం..’ అంటూ తనదైన రాజకీయ వ్యూహంతో ముందుకు వెళుతున్నారు.

తొలి విడతలో 5 సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇప్పటికి మొత్తంగా పధ్నాలుగు సీట్ల వరకు అభ్యర్థుల్ని ఖరారు చేసేశారు. తాజాగా, ఈ మేరకు ఆయా అభ్యర్థులతో భేటీ అయి, ‘ఖచ్చితంగా గెలవాల్సిందే..’ అని తేల్చి చెప్పారు. అంతే కాదు, రాజకీయ ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు వస్తే, నేరుగా తనను సంప్రదించాలనీ వారికి సూచించారు.

తాడేపల్లిగూడెం సీటు విషయమై కొంత పంచాయితీ నడిచినా, అది జనసేనకే ఖాయమైంది. పార్టీ సీనియర్ నేత బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేయబోతున్నారు. పంచకర్ల రమేష్‌బాబు తదితరులకూ టిక్కెట్లు దక్కాయ్. ఏ సీటుకి ఆ సీటే ప్రత్యేకం.. అన్నట్లుగా అభ్యర్థుల ఎంపిక జరిగింది.

ఇంకో ఏడు సీట్లకు జనసేనాని అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి వుంది. అక్కడితో అసెంబ్లీ అభ్యర్థుల ఖరారు పూర్తవుతుంది, లోక్ సభకు సంబంధించి ఇద్దరు అభ్యర్థులనూ జనసేనాని అధికారికంగా ఖరారు చేయాల్సి వుంది. అందులో ఒకటి జనసేనాని పోటీ చేసే స్థానం.. అని అంటున్నారు. ఇంకోటి, వైసీపీ నుంచి జనసేనలో చేరిన వల్లభనేని బాలశౌరి కావొచ్చు.

కాగా, భీమిలి నుంచి సందీప్ పంచకర్లకు అవకాశం దక్కాలనీ, అలాగే పోతిన వెంకట మహేష్ సైతం గెలిచే అభ్యర్థి అనీ జనసైనికులు, తమ అధినేతకు సోషల్ మీడియా వేదికగా విన్నవిస్తున్నారు. ఆయా నేతలు, అధినేత నిర్ణయమే శిరోధార్యం అని చెబుతున్నారు.

ఒకటి రెండు రోజుల్లోనే, మొత్తం అభ్యర్థులు ఖరారైపోతారనీ, ఆ తర్వాత జనసేనాని పూర్తిగా జనంలోనే వుంటారనీ జనసేన వర్గాలంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vignesh Shivan: పిల్లలతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేసిన విఘ్నేశ్-నయనతార

Vignesh Shivan: దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత జీవితంలో ఒక్కటయ్యారు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)-నయనతార (Nayanthara). ఇటివలే వారి రెండో పెళ్లి రోజు వార్షికోత్సవం...

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు...

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట...

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

రాజకీయం

ఈవీఎంలు మోసం చేశాయ్.! వైఎస్ జగన్ కొత్త నాటకం.!

ఓటమికి కారణం దొరికేసింది.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన ఓటమికి కారణమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై యుద్ధం ప్రకటించేశారు.! వైసీపీ కార్యకర్తలంతా, ‘మేము సైతం సిద్ధం’ అంటూ సోషల్ మీడియా వేదికగా...

ఈసారి అసెంబ్లీ సెషన్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి మూడు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ...

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

జగన్ మార్కు దుబారా: ‘రిషికొండ’ ప్యాలెస్ సాక్షిగా.!

దేనికోసం రిషికొండ మీద పర్యావరణ విధ్వంసానికి పాల్పడి మరీ, అత్యంత ఖరీదైన భవంతుల్ని నిర్మించినట్టు.? అంతకు ముందు పర్యాటక శాఖ కొన్ని నిర్మాణాల్ని అక్కడ చేపట్టింది. కాటేజీల ద్వారా కొంత ఆదాయం ప్రభుత్వానికి...

ఎక్కువ చదివినవి

మెగా పవర్: అన్నయ్యకి తమ్ముడు ఇచ్చే గౌరవం ఇది.!

తల్లి దూరంగా వెళ్ళిపోయింది.. చెల్లెలు కంటతడి పెట్టి మరీ, అన్నకి దూరమయ్యింది.! కాదు కాదు, తల్లిని తరిమేశాడు.. చెల్లిని గోడకేసి కొట్టాడు.. ఇదీ ఓ కుటుంబంలోని అన్న అరాచకం.! ఇంకో కుటుంబం వుంది. అన్నయ్యకు...

రఘురామ కేసులో జగన్ అరెస్టయ్యే అవకాశం వుందా.?

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టయినప్పుడు, రఘురామ కృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అరెస్టవకూడదు.? అంటూ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన...

Lions: వేగంగా వెళ్తున్న రైలు.. పట్టాలపై 10 సింహాలు..! లోకోపైలట్ ఏం చేశాడంటే..

Lions: వేగంగా వెళ్తున్న రైలు.. లోకో పైలట్ చాకచక్యం.. అధికారుల ప్రశంసలు. రైలు పట్టాలపై ఏకంగా 10 సింహాలు ఉండటం చూసిన లోకోపైలట్ ఎమర్జెన్సీ బ్రేక్స్ వేసి వాటి ప్రాణాలు కాపాడాడు. వృత్తిలో...

పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి..హోమ్ మినిస్టర్ అనిత

ఆంధ్రప్రదేశ్ లో పూర్తిస్థాయిలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈనెల 12 న నాలుగో సారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేసిన రోజే 25 మంత్రులను ప్రకటించారు. శుక్రవారం వారికి ముఖ్యమంత్రి శాఖలను...

Pawan Kalyan: ‘మీ సేవలు అమూల్యం’.. కృష్ణతేజ IASకు డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు

Pawan Kalyan: జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఎంపికైన ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ ఎమ్.వి.ఆర్.కృష్ణ తేజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభినందనందించారు. ఓ ప్రకటనలో.. ‘బాలల...