Switch to English

ఆంధ్రప్రదేశ్‌కి విశాఖపట్నమే దిక్కు.. ఇదీ జగన్‌ వాదన.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కి ఓ ముఖ్య నగరం రాజధానిగా వుండాల్సిందే. లేని పక్షంలో, రాష్ట్రానికి నిధుల్ని తీసుకురాలేం.! ఇదీ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చేస్తున్న వాదన. ఎలా చూసినా, రాష్ట్రానికి పెద్ద నగరం.. ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచే రాష్ట్రం విశాఖపట్నం మాత్రమే. విజయవాడ కూడా ప్రముఖ నగరమే కావొచ్చుగానీ, విశాఖకు వున్న వెసులుబాట్లు విజయవాడకు లేవు. కర్నూలు సంగతి సరే సరి.

అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20 నుంచి జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నుంచి ఆసక్తికరమైన వాదనలు తెరపైకొస్తున్నాయి. అమరావతి నిర్మాణానికి చాలా సమయం పడుతుందనీ, పూర్తిస్థాయిలో అమరావతి అభివృద్ధి చెందేలోగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందనీ, రాష్ట్రానికి ఆదాయం ఇచ్చే నగరాన్ని రాజధానిగా ఎంచుకుంటే, అభివృద్ధిలో ముందుకు వెళ్ళగలమనీ వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు.

‘అయినా, రాష్ట్రానికి విశాఖపట్నం ఒక్కటే రాజధాని అవుతుందని మేం చెప్పడంలేదు. అమరావతిని రాజధాని కాకుండా చేయాలనుకోవడంలేదు. విశాఖపట్నంతోపాటు, కర్నూలు, అమరావతి కూడా రాష్ట్రానికి రాజధానులే.. అవుతాయి..’ అన్నది వైఎస్సార్సీపీ నేతల తాజా వాదన. మొత్తమ్మీద, సరికొత్త వాదనలతో తెరపైకొస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన సందేశం ఇవ్వగలుగుతుందా.? ఆ సందేశం, వివరణతో రాష్ట్ర ప్రజలు సంతృప్తి చెందుతారా.? అన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.

చంద్రబాబు చెప్పినదానికంటే ఎక్కువే ఇచ్చేందుకు ఆలోచిస్తున్నామంటూ అమరావతి రైతుల్ని ఉద్దేశించి మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు చేస్తున్న వ్యాఖ్యలు, ఆ అమరావతి రైతుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోతుండడం గమనార్హం. అమరావతికి పరిహారమిస్తారు సరే.. గన్నవరం విమానాశ్రయానికి కావొచ్చు, రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులకు కావొచ్చు.. భూములిచ్చిన రైతులు కూడా అదే తరహా ప్యాకేజీలు అడిగితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటట.? అన్నది తాజాగా తెరపైకొస్తోన్న సరికొత్త సమస్య.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...