Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: చంద్రబాబుకి ‘సాయం’ చేస్తున్న జగన్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ‘సాయం’ చేస్తున్నారు. ఔను, ఇది నూటికి నూరు పాళ్ళూ నిజం. రాజధాని అమరావతి జోలికి వెళ్ళకుండా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తన పాలనను కొనసాగించి వుంటే, ఇప్పుడు రాజధాని అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునేవి కావు.

అమరావతి పేరుతో చంద్రబాబు ఈ స్థాయిలో పొలిటికల్‌ స్టంట్లు చేయగలుగుతున్నారంటే, దానికి కారణం ముమ్మాటికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డే. అమరావతి పరిధిలో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవిచూసింది. స్వయానా చంద్రబాబు తనయుడు లోకేష్‌ ఓడిపోయారు మంగళగిరి నియోజకవర్గంలో. కానీ, ఈక్వేషన్స్‌ మారుతున్నాయి. చంద్రబాబు సైతం ఊహించని స్థాయిలో ఆయనకు రాజకీయంగా మద్దతు పెరుగుతోంది. ఇదంతా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పుణ్యమే.

తెలిసి చేస్తున్నారా.? తెలియక చేస్తున్నారా.? అసలు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆలోచన ఏంటి.? పరిపాలనను గాలికొదిలేసి, అమరావతిని అయోమయంలోకి నెట్టేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నారు వైఎస్‌ జగన్‌. లేకపోతే, 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మాత్రమే ఎంపీలు వున్న పార్టీకి బలం పెంచేలా.. అదీ ప్రతిపక్షానికి ఊతమిచ్చేలా అధికార పార్టీ ‘చచ్చు’ నిర్ణయాలు తీసుకోవడమేంటి.?

రాజధాని అమరావతిలో మహిళలు నడుం బిగించారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా. జాతీయ మహిళా కమిషన్‌, రాజధానిలో మహిళా రైతులపై పోలీసుల దమనకాండపై తీవ్రంగా స్పందించింది. తాజాగా, చంద్రబాబు విజయవాడలో హల్‌చల్‌ చేస్తే, ఆయన మీద మహిళా లోకం పూలు జల్లింది. ఇదంతా వైఎస్‌ జగన్‌ ఎందుకు చేయిస్తున్నట్లు.?

చంద్రబాబు సహా నేతల్ని అరెస్ట్‌ చేసి, వాహనంలో తరలించే క్రమంలో అత్యుత్సాహం చూపిన పోలీసులకు, వాహనం తాలూకు తాళం పోవడంతో ముచ్చెమటలు పట్టాయి. ఇవన్నీ దేనికి సంకేతం.? ఏదో చెయ్యబోయి, ఇంకోటేదో చేసేస్తోంది అటు ప్రభుత్వం, ఇటు పోలీసు వ్యవస్థ. ఒక్కటి మాత్రం నిజం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వేరే శతృవు అక్కర్లేకుండా.. తమ ప్రభుత్వ నిర్ణయాలే తమకు గొడ్డలిపెట్టులా వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చేసుకుంటుండడం హాస్యాస్పదం కాక మరేమిటి.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...