గత నెల రోజుల నుండి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాగబాబు జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసిన మ్యాటర్ గురించే న్యూస్. జబర్దస్త్ నుండి నాగబాబు ఎందుకు వచ్చాడు అన్నదానికి ఇప్పటివరకూ సరైన కారణాలు తెలియలేదు. నాగబాబు యూట్యూబ్ లో కారణాలు చెబుతాను అంటూ వీడియోలు చేస్తున్నాడు కానీ అవి అన్నీ సీరియల్ తరహాలో సాగతీస్తున్నాడు కానీ అసలు కారణాలు మాత్రం చెప్పడంలేదు.
జబర్దస్త్ లో తన ప్రయాణం ఎలా మొదలైందీ దగ్గరనుండి పురాణం మొత్తం చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే మాకు అందిన సమాచారం ప్రకారం జబర్దస్త్ నుండి నాగబాబు వచ్చేయడం వెనకాల టీమ్ డైరెక్టర్లుగా చేసిన నితిన్, భరత్ పాత్ర ఎంత ఉందో జబర్దస్త్ కంటెస్టెంట్ల పాత్ర కూడా అంతే ఉన్నట్లు తెలుస్తోంది.
హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ వంటి వారు అందరూ నాగబాబు ఎగ్జిట్ కు కారకులే అని తెలుస్తోంది. అసలు వివరాల్లోకి వెళితే.. మొదట నితిన్, భరత్ జబర్దస్త్ షో నుండి వచ్చేసినప్పుడు జీ టీవీతో ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం జబర్దస్త్ నుండి హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్, కిరాక్ ఆర్పీ వంటి వారిని సంప్రదిస్తే వారందరూ కూడా రావడానికి సుముఖంగానే ఉన్నారు.
కాకపోతే జబర్దస్త్ యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం వీరెవ్వరూ కూడా మరో కామెడీ షో చేయకూడదు. ఈ ఒప్పందం గురించి తెల్సిన తర్వాత అందరూ నాగబాబు సహాయం కోరారు. అప్పటికే జబర్దస్త్ యాజమాన్యంతో కొంత విభేదించి ఉన్న నాగబాబు, ఇదే సరైన సమయం అని భావించి వారందరితో పాటు నాగబాబు కూడా బయటకు వచ్చేసాడు.
అయితే జబర్దస్త్ యాజమాన్యం సరైన సమయంలో స్పందించి హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ వంటి వారితో రామోజీ ఫిలిం సిటీలో విడివిడిగా మీటింగ్స్ పెట్టారు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ వంటి వారు కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా మల్లెమాలలోనే పలు షోస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవన్నీ కోల్పోవాల్సి వస్తుందని వారిద్దరికీ ఒకలాంటి వార్నింగ్ ఇచ్చిందిట జబర్దస్త్ టీమ్.
సో వారిద్దరూ జబర్దస్త్ లోనే ఉండిపోయారు. చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ మాత్రం నాగబాబుతో పాటు జీ టివిలోకి వెళ్లిపోయారు. ఈ రకంగా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది నాగబాబుకు వెన్నుపోటు పొడిచినట్లు ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు.
240417 991432Whoah this weblog is magnificent i really like reading your articles. Keep up the great paintings! You realize, a great deal of persons are searching round for this data, you could aid them greatly. 60290
483919 74450Merely a smiling visitant here to share the really like (:, btw outstanding pattern . 187673
861532 505062Excellent editorial! Would like took pleasure the particular following. Im hoping to learn to read a great deal much more of you. Theres no doubt that you possess tremendous awareness and even imagination. I happen to be very highly fascinated making use of this critical information. 141122