Switch to English

సాక్ష్యం చూపిస్తేనే ‘ఓటు’ సెలవు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం. ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగలో ఓటరు సంధించే బ్రహ్మాస్త్రం. తమ తలరాతను నిర్దేశించే నేతల తలరాత రాసే ఓటరు.. ఈ విషయంలో ఉదాసీనంగా ఉండటం క్షమించరాని నేరం. వాస్తవానికి ఓటేసే విషయంలో పల్లె జనానికి ఉన్నంత చైతన్యం పట్టణ ఓటరుకు ఉండదు. గ్రామాల కంటే పట్టణాలు, నగరాల్లో ఓటింగ్ శాతం తక్కువ నమోదు కావడమే ఇందుకు కారణం.

దీంతో ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం కూడా చర్యలు చేపట్టింది. ఓటేయాలంటూ ప్రచారం చేపట్టింది. అయితే, ఎన్నికల సంఘం ఎంత ప్రచారం చేసినప్పటికీ.. ప్రముఖులు కూడా ఓటు ప్రాముఖ్యత చెప్పినప్పటికీ.. పలువురు ఓటు వేయడాన్ని లైట్ గానే తీసుకుంటున్నారు. పోలింగ్ రోజు ఇచ్చే సెలవును విహారయాత్రలు వెళ్లడానికి, సొంత పనులు చూసుకోవడానికి వాడుకుంటున్నారు. ముఖ్యంగా ఐటీ సంస్థల ఉద్యోగులు పోలింగ్ కు దూరంగా ఉంటున్నారని గుర్తించారు.

దీంతో బెంగళూరులోని కంపెనీలు కూడా రంగంలోకి దిగాయి. ఓటు కోసం సెలవును దుర్వినియోగం చేయకుండా చర్యలు చేపట్టాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బెంగళూరులో రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 18న అక్కడ జరిగే పోలింగ్ లో తమ సంస్థ ఉద్యోగులు కూడా పాల్గొనేలా చేయాలని ఐటీ కంపెనీలు గట్టిగా నిర్ణయం తీసుకున్నాయి. పోలింగ్ లో ఓటేసేందుకు ఆ రోజు సెలవు ప్రకటించాయి. అయితే, తాము ఎన్నికల్లో ఓటు వేసి, తాము ఓటు వేసినట్టు ఆధారాలను హెచ్ ఆర్ విభాగంలో సమర్పించాలని షరతు విధించాయి. అలా చేసినవాళ్లకే వేతనంతో కూడిన సెలవు లభిస్తుంది. లేనిపక్షంలో వారికి సెలవు రద్దు అవుతుంది. పైగా ఓటు వేయనందుకు చర్యలు కూడా తీసుకోనున్నాయి.

తమ ఉద్యోగులంతా ఓటింగ్ లో పాల్గొనేలా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఓటింగ్ రోజున సెలవు ఇస్తే, ఓటు వేయకుండా విహారయాత్రలకు వెళుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో శక్తివంతమైన ఆయుధాన్ని పక్కన పడేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు ఇలా చేయడం సబబు కాదని ప్రజాస్వామ్యవాదులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. ఇన్ఫోసిస్ సహా పలు పేరు పొందిన ఐటీ సంస్థలు తమ ఉద్యోగులు ఓటేసేలా చర్యలు తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు ఉద్యోగులకు సందేశాలు పంపినట్టు తెలుస్తోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...