Switch to English

ఈవీఎంల మొరాయింపులు.. అక్కడక్కడా ఉద్రిక్తతలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పలు చోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) మొరాయింపులు.. అక్కడక్కడా ఉద్రిక్తత పరిస్థితులతో ఆంధ్రప్రదేశ్ లో గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల పోలింగ్ ప్రశాంతంగానే సాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. అయితే, ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడంతో కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. ఎండ తీవ్రత పెరగకుండానే ఓటు వేసి వెళ్లిపోదామని వచ్చిన వారంతా ఈవీఎంల మొరాయింపుతో ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

మరోవైపు పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు అనుమతించకపోవడంతో వాటిని ఎక్కడ భద్రపరచాలో తెలియక పలువురు ఇబ్బంది పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 45,000 ఈవీఎంలను వినియోగిస్తుండగా, స్వల్ప సాంకేతిక కారణాలతో 372 ఈవీఎంలు పనిచేయలేదని, వాటిని సరిచేసి పోలింగ్ కొనసాగిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. పోలింగ్ ఆలస్యమైనప్పటికీ, సమయం మాత్రం పెంచడం కుదరదని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఇది ఓటింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా 157 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రతినిధులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈవీఎంలు పనిచేయకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 శాతం ఈవీఎంలు పనిచేయడంలేదని, ఫలితంగా పోలింగ్ ఆలస్యమవుతోందని, ఈసీ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైన ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

కొన్నిచోట్ల తెలుగుదేశానికి ఓటేస్తుంటే వైఎస్సార్ సీపీకి ఓటు పడుతోందనే ఆరోపణలు వస్తున్నాయని, ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు. కాగా, మంగళగిరిలో ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడంపై వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ విషయంపై అధికారులను అడిగినా సరిగా స్పందించలేదని విమర్శించారు. అధికారుల వైఖరికి నిరసనగా ఆయన పోలింగ్ కేంద్రం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. పోలింగ్ ప్రారంభమై మూడు గంటలు దాటినా ఈవీఎంల లోపాన్ని సరిదిద్దకపోవడంపై కుట్రకోణం ఉందేమోనని అనుమానం వ్యక్తంచేశారు. వైఎస్సార్ సీపీకి ఓట్లు పడేచోట ఈవీఎంలు పనిచేయకుండా చేశారన్నారు.

మరోవైపు రాష్ట్రంలో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద తెలుగుదేశం, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం యలమందలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అలాగే కడప జిల్లా జమ్మలమడుగులో కూడా అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తిలో సాక్షాత్తు జనసేన పార్టీ అభ్యర్ధే ఈవీఎం ధ్వంసం చేశారు. అక్కడ జనసేన నుంచి బరిలో నిలిచిన మధుసూదన్ గుప్తా ఈ చర్యకు పాల్పడ్డారు. పోలింగ్ ఏర్పాట్లు సరిగా చేయలేదని ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగిన ఆయన.. అక్కడున్న ఈవీఎం యంత్రాన్ని నేలకేసి కొట్టారు. దీంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తమ్మీద అక్కడక్కడా ఇలాంటి ఘటనలు మినహాయిస్తే పోలింగ్ ప్రశాంతంగానే సాగుతోంది. అయితే, ఎండ తీవ్రత, ఈవీఎంల సమస్యల కారణంగా కొన్నిచోట్ల ఆలస్యంగా ఓట్లు పోలవుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు లైనులో ఉన్నవారికి ఓటేసే అవకాశం ఉంటుందని, అందువల్ల అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని ఈసీ పేర్కొంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...