Switch to English

సినిమా.. ఇప్పట్లో కుదుటపడటం సాధ్యమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పైరసీ వైరస్‌ని తట్టుకుంది సినీ పరిశ్రమ.. ఓటీటీ నుంచి వస్తోన్న పోటీని తట్టుకుని నిలబడేందుకు నానా తంటాలూ పడుతోంది. సరిగ్గా ఈ టైంలోనే కరోనా వైరస్‌ వచ్చి పడింది. ఈ దెబ్బకి సినీ పరిశ్రమ మరింత కష్టాల్లోకి వెళ్ళిపోయింది. సినీ పరిశ్రమ కోలుకోవడం సాధ్యమేనా.? అన్న ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టమైన వ్యవహారమే. ప్రభుత్వాలు ఆదుకుంటే తప్ప, సినీ పరిశ్రమ తిరిగి మునుపటి వైభవాన్ని సాధించడం అసాధ్యమన్నది మెజార్టీ సినీ ప్రముఖులు చెబుతున్న మాట. కరోనా లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులొస్తున్నాయ్‌. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చేసుకోవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. షూటింగులకూ త్వరలోనే అనుమతులొచ్చేస్తాయ్‌.. థియేటర్లు తెరుచుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు. కానీ, ప్రేక్షకుడు ఎలాంటి బెరుకూ లేకుండా థియేటర్‌కి రాగలడా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

ఇదొక్కటే కాదు, ఇంకా చాలా సమస్యలున్నాయి. షూటింగ్‌ స్పాట్‌లో ‘భౌతిక దూరం’ అనేది సాధ్యమయ్యే వ్యవహారమే కాదు. మరోపక్క, కరోనా వైరస్‌ గ్రౌండ్‌ లెవల్‌లో బాగా విస్తరించేసింది. దేశమంతటా ఇదే పరిస్థితి. షూటింగ్‌ స్పాట్‌లో సీనియర్‌ నటీనటుల పరిస్థితేంటి.? సహజంగానే సినీ జనాలు కాస్త సెన్సిటివ్‌గా వుంటారు. హీరోయిన్లయితే మరీ సుకుమారం. సో, వాళ్ళలో చాలామందికి తేలిగ్గానే కరోనా వైరస సోకే అవకాశం వుంటుంది. కరోనా సోకితే, షూటింగ్‌ షెడ్యూల్స్‌ అప్పటికప్పుడు తారుమారైపోతాయి. హీరోయిన్‌కి కరోనా సోకితే షూటింగ్‌ ఆగిపోతుంది.. హీరోకి కరోనా సోకితే షూటింగ్‌ ఆగిపోతుంది.. మళ్ళీ అదంతా సెట్‌ అవడానికి ఎంత టైవ్‌ు పడుతుందో చెప్పలేం. మామూలు రోజుల్లోనే, సెట్‌లో ప్రమాదవశాత్తూ ఏదన్నా జరిగితే, ఆ సినిమా రిలీజ్‌ నెలల తరబడి, ఒక్కోసారి ఏళ్ళ తరబడి వాయిదా పడుతుంటాయి. అలాంటిది.. ఇప్పుడు మనం ఎదుర్కొంటోన్నది కరోనా వైరస్‌.

టాలీవుడ్‌కి సంబంధించినంతవరకు సినీ పెద్దలు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని కలిశారు. ఈ నెల 9న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కలవనున్నారు. తమ సమస్యల్ని ప్రభుత్వాల ముందుంచుతారు. తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉపశమనాల సంగతి సరే. మరి, ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి.? కేరళలో షూటింగ్‌ చేయాల్సి రావొచ్చు.. ముంబైలో షూటింగ్‌ చేసుకోవాల్సి రావొచ్చు.. విదేశాలకు వెళ్ళాల్సి వస్తుంది.. ఇలా చెప్పుకుంటూ పోతే, సమస్యలు చాలానే వున్నాయి. ఇన్ని సమస్యల నడుమ, సినీ పరిశ్రమ ఎప్పటికి కుదుటపడాలి.? ఆరు నెలలా.? ఏడాది సమయమా.? అది మాత్రం చెప్పలేమంటున్నారు సినీ ప్రముఖులు. కానీ,త్వరలోనే సమస్యలకు పరిష్కారం లభించాలని మాత్రం కోరుతున్నారు సినీ జనాలు. చూద్దాం.. ఏం జరుగుతుందో.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....