మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ‘జాతీయ పార్టీ’ విషయమై ‘తూచ్’ అనేశారు. ప్రధాని అవ్వాలన్న బలమైన కోరిక ఆయనలో వున్న మాట వాస్తవం. ఇదే విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో పరోక్షంగా ప్రస్తావించారు. దేశంలో చాలా రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యులతో గతంలో భేటీలు నిర్వహించారు. ‘కొత్త ఫ్రంట్’ ఏర్పాటు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. వాటిల్లో చాలావరకు బెడిసికొట్టేశాయి కూడా. ‘మీతో కలిసి పనిచేయడానికి సుముఖమే..’ అని ఉదయాన్నే చెప్పి, సాయంత్రానికి ప్లేటు ఫిరాయించిన పార్టీలూ లేకపోలేదు.
అందుకే, కేసీఆర్ ‘నేషనల్ ఆలోచనల’ విషయంలో కాస్త తటపటాయిస్తున్నారు. ఇప్పుడు ఇంకోసారి ఈ అంశంపై చర్చ జరగడంతో, కేసీఆర్.. పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతానికి ‘జాతీయ పార్టీ ముచ్చటే లేదు’ అని తేల్చి చెప్పేశారు. ‘పత్రికల్లోనూ, ఛానళ్ళలోనూ ఏవేవో వస్తుంటాయి. వాటిని నమ్మొద్దు. సమయం వస్తే, అప్పుడు ఆలోచిద్దాం..’ అని కేసీఆర్, తాజాగా పార్టీ ముఖ్య నేతల సమావేశంలో వ్యాఖ్యానించారు. సో, ఇక్కడితో ఈ ‘కొత్త ముచ్చట’ ముగిసినట్లయ్యిందన్నమాట. నిజానికి, ఇది పాత ముచ్చటే. ఎప్పటికప్పుడు కొత్తగా తెరపైకొస్తుంటుంది.
తన పుత్రరత్నం కేటీఆర్‌కి రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇచ్చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరుని ‘జాతీయ స్థాయి’ టచ్ వచ్చేలా మార్చి, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ చేస్తున్న ఆలోచనలకి జస్ట్ ఇంకో ‘పాజ్’ అంతే. ‘ఇక్కడితో కథ ముగిసింది’ అనుకోవడానికి వీల్లేదు. కేసీఆర్, రాజకీయాల్ని ఓ రేంజ్లో ఔపోసన పట్టేశారు. జాతీయ స్థాయిలో రాజకీయాలు ఎప్పుడెలా మారతాయో ఆయనకి తెలుసు. ఏది అనుకూలం.? ఏది ప్రతికూలం.? అన్నదానిపై ఆయనకు పూర్తి స్పష్టత వుంది. అందుకే, ఇంకో రెండు మూడేళ్ళు బహుశా కేసీఆర్, జాతీయ ఆలోచనలు చేయకపోవచ్చ. కానీ, ఈలోగా మళ్ళీ మళ్ళీ ‘లీకులు’ అందుతూనే వుంటాయి మీడియాకి. అలా లీకులు అందించేది కూడా ‘గులాబీ’ తోటకి చెందినవారేనన్నది మీడియా వర్గాల్లో జరుగుతోన్న చర్చ.
679603 489357Youre so cool! I dont suppose Ive read anything in this way before. So nice to uncover somebody with some original tips on this subject. realy appreciate starting this up. this superb site is something that is necessary over the internet, a person if we do originality. valuable work for bringing something new towards the web! 861410