Switch to English

వీకెండ్ ప్రజా సేవ: పవన్ కళ్యాణ్‌ని గుర్తించిన పేర్ని నాని.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ది వీకెండ్ ప్రజా సేవ.. అంటూ ఎట్టకేలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. గొప్ప విషయమే ఇది.! వారానికో, పక్షం రోజులకో పవన్ కళ్యాణ్ ప్రజా సేవ చేస్తున్నారని వైసీపీ గుర్తించడమంటే చిన్న విషయం కాదు కదా.!

బులుగు కళ్ళతో చూస్తే, ప్రజలకు ఇంకెవరైనా సేవ చేస్తున్న విషయమే కనిపించదు. బహుశా ఆ పొరలు ఇప్పుడిప్పుడే కాస్త వీడుతున్నట్టున్నాయన్నది జనసేన పార్టీ, మంత్రి పేర్ని నాని మీద సంధిస్తున్న తాజా సెటైర్.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు. రాజకీయాలతోపాటు, సినిమాలూ ఎందుకు చేయాల్సి వస్తోందో సవివరంగానే పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సినిమాల్లోనూ ఆలస్యమే, రాజకీయాల్లోనూ ఆలస్యమేంటూ పేర్ని నాని ఎద్దేవా చేసేశారు. సినిమాల్లో పవన్ కళ్యాణ్ ‘ఆలస్యం’ అని ఏ నిర్మాత అయినా ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ మీద ఫిర్యాదు చేసిన సందర్భమే లేదు.

ఇక, మంత్రి పదవి పోయాక పేర్ని నాని తన గుర్తింపే పోయినట్లు దిగాలుపడిపోయిన మాట వాస్తవం. పాపం, పనిగట్టుకుని పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తే, మంత్రి పదవి కొనసాగుతుందని పేర్ని నాని చాలా పాట్లు పడ్డారు. కానీ, ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

ప్లీనరీ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పొగిడే క్రమంలో పేర్ని నాని తన స్థాయిని ఎంతలా దిగజార్చేసుకున్నదీ సభ్య సమాజం చూసిందన్నది జనసేన పార్టీ వాదన.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సాధారణ ప్రజానీకం నేరుగా కలిసే అవకాశం వుందా.? తమ సమస్యల్ని చెప్పుకునే పరిస్థితి వుందా.? పవన్ కళ్యాణ్ జనంలోకి వెళితే, వైసీపీ ప్రభుత్వం తమను పెడుతున్న ఇబ్బందుల్ని ఏకరువు పెడుతూ, జనసేనాని వద్ద వాపోతున్నారు జనం.

ప్రభుత్వం రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తోంటే, వైసీపీ పీడిత ప్రజానీకం జనసేనాని వద్దకు ‘రక్షించండి మహాప్రభో..’ అంటూ ఎందుకు వెళుతున్నారో పేర్ని నాని తెలుసుకుంటే మంచిదేమో.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...