Switch to English

అన్నదాతల ఆందోళన కొలిక్కి వచ్చేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పెద్ద ఎత్తున సాగే ప్రజా నిరసనకు ఏ సర్కారైనా దిగి రాక తప్పదు. ప్రజాగ్రహాన్ని కాదని ఏ ప్రభుత్వమూ మనలేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో రైతన్నలు చేస్తున్న ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. వారితో చర్చించడానికి సిద్ధమని ప్రకటించింది. వ్యవసాయ చట్టాలపై వారికి ఉన్న అపోహలు తొలగించడంతోపాటు వారి డిమాండ్లు అన్నింటిపైనా చర్చిస్తామని పేర్కొంది.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొంతకాలంగా రైతన్నలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వేలాది మంది రైతులు ఢిల్లీలో సాగిస్తున్న ఆందోళన ఆదివారం నాలుగో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో అన్నదాతలతో చర్చించడానికి సిద్దంగా ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ప్రకటించడంతో ఆదివారం వారితో చర్చలకు అధికారులు సన్నద్ధమయ్యారు.

వాస్తవానికి రైతన్నలు జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు అనుమతి కోరగా.. చర్చలు జరపడానికి రావాలని ఆహ్వానించారు. దీంతో ప్రభుత్వంతో చర్చించడానికి తాము సిద్దంగా ఉన్నామని పంజాబ్ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రుల్డు సింగ్ వెల్లడించారు. ఈ ఆందోళనల్లో పాల్గొన్న దాదాపు 500 రైతు సంఘాల్లో పంజాబ్ కిసాన్ యూనియన్ కూడా ఉంది. ఇంతకీ రైతుల ఈ ఆందోళనలకు కారణమేంటి? ఓసారి చూద్దాం..

ఇప్పటివరకు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు మార్కెట్ యార్డుల్లోనే జరిగేవి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులతో ఈ అమ్మకాలు, కొనుగోళ్ల పద్ధతి మారిపోనుంది. ఇకపై రైతులే నేరుగా ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చు. రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం బిల్లు-2020 ప్రకారం అన్నదాతలు తమ పంటలను ఎవరికైనా విక్రయించుకోవచ్చు. మార్కెట్ యార్డుకు వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే మద్దతు ధర కోసం ప్రభుత్వంపై ఆధారపడక్కర్లేదు. మధ్యలో ఎలాంటి దళారులూ ఉండరు. మార్కెటింగ్, రవాణా ఖర్చులు కూడా ఉండవు. అలాగే ధరల హామీ-వ్యవసాయ సేవల బిల్లు ప్రకారం రైతులు తాము పండించబోయే పంటకు సంబంధించి ముందుగానే ప్రైవేటు కంపెనీలతో ఒప్పందం చేసుకోవచ్చు.

ఇక నిత్యావసర వస్తువల సవరణ బిల్లు ప్రకారం ధాన్యం, నూనె గింజలు, ఉల్లిగడ్డలు, బంగాళాదుంపలను నిత్యావసరాల జాబితా నుంచి తొలగించొచ్చు. ఫలితంగా వాటిని బ్లాక్ చేసి తర్వాత ఇష్టానుసారం ధరలు పెంచి అమ్మడానికి వీలుండదు. ఇవన్నీ రైతులకు మేలు చేసేవే అని కేంద్రం చెబుతున్నా.. అన్నదాతలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇందుకు కూడా సరైన కారణాలే ఉన్నాయి. ఈ బిల్లులన్నీ అమల్లోకి వస్తే వ్యవసాయ రంగం కూడా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు కంపెనీలు సిండికేటుగా ఏర్పడి, తాము నిర్దేశించిన రేటుకే వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే తమకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని భయపడుతున్నారు. అదే జరిగితే తమకు కనీసం మద్దతు ధర కూడా దక్కదని పేర్కొంటున్నారు.

దేశవ్యాప్తంగా ఎక్కువ మంది రైతులు అంతగా చదువుకోనివారే కావడంతో ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం కష్టమని చెబుతున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ ప్రైవేటు కంపెనీలు తమకు అనుకూలంగా చేసుకుని దోపిడీకి పాల్పడే అవకాశం ఉందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతన్నలు ఆందోళనబాట పట్టారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...