పాన్ ఇండియా స్టార్ అలియాస్ మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ వరల్డ్ రేంజ్ సినిమాలతో బిజీ బిజీ గా ఉన్నాడు. ప్రభాస్ నెక్స్ట్ సినిమాగా రాబోయేది మాత్రం ‘రాధే శ్యామ్’. చాలా రోజుల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న కంప్లీట్ లవ్ స్టోరీ. కానీ ఇదొక లండన్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ సినిమా అనే విషయాలు ఇది వరకే తెలిపాం. నేడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాధే శ్యామ్ నుంచి ‘బీట్స్ అఫ్ రాధే శ్యామ్’ అని ఒక సాంగ్ ట్యూన్ ని రిలీజ్ చేశారు.
ఆ ట్యూన్ చాలా మెలోడియస్ గా ఉండడంతో పాటు, చివర్లో వచ్చే లిరిక్స్ కూడా అందరినీ మెప్పిస్తున్నాయి. ఒక్కొక్క పోస్టర్ కి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. కానీ, ఈ సినిమా ఎలా ఉంటుందా అనే అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ మేము తాజాగా తెలుసుకున్న సమాచారం ప్రకారం, రాధే శ్యామ్ అనేది పలురకాల ట్విస్ట్ లతో సాగే ఓ లవ్ స్టోరీ. అలాగే ప్రభాస్ ఇందులో పలు రకాల షేడ్స్ మరియు గెటప్స్ లో కనిపించి మెప్పిస్తాడట. ప్రభాస్ – పూజ హెగ్డే ల లవ్ ట్రాక్ లో వచ్చే కాంబినేషన్స్ మేజర్ హైలైట్ గా నిలవనున్నాయట. ప్రభాస్ పామ్ రీడర్(చేయి చూసి జాతకాలు చెప్పడం) పాత్రలో బాగా ఎంటర్టైన్ చేస్తాడని సమాచారం..
యువి క్రియేషన్స్ – గోపికృష్ణ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో 5 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర టీం యూరప్ లో చకచకా షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.
717467 768477Dead written subject matter, Actually enjoyed reading through . 822023
986435 400155Exceptional weblog here! Additionally your site rather a good deal up quick! What host are you the usage of? Can I get your affiliate link to your host? I wish my website loaded up as quickly as yours lol 268393