Switch to English

ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ : ‘నిశబ్దం’ ట్రైలర్‌ చూసి పూరి ఫోన్‌ చేసి ప్రశంసించారు – హేమంత్‌ మధుకర్‌ I

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశబ్దం గత ఏడాది కాలంగా అదుగో ఇదుగో అంటూ వాయిదాలు పడుతూ వచ్చంది. సమ్మర్‌ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్రచారం కూడా మొదలు పెట్టారు. అంతలో కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ విధించడంతో సినిమా విడుదల ఆగిపోయింది. ఇన్ని రోజులు థియేటర్లలో విడుదల చేయాలనుకున్న మేకర్స్‌ ఇప్పుడు ఓటీటీలో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. విడుదల సందర్బంగా దర్శకుడు హేమంత్‌ మధుకర్‌ తో ఎక్స్‌ క్లూజివ్‌ ఇంటర్వ్యూ.

సినిమా మొత్తం అమెరికాలో చిత్రీకరణ చేశారట, అక్కడ షూటింగ్‌ అంత ఈజీగా ఉంటుందా?

మేము సినిమాను చాలా స్పీడ్‌ గా చిత్రీకరించాం. 55 నుండి 56 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ పూర్తి చేశాం. యూనిట్‌ సభ్యులు నటీనటులు అంతా సహకరించడం వల్ల వెంటనే షూటింగ్‌ పూర్తి చయగలిగాం. కాని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ మాత్రం ఏడాది వరకు పట్టింది. అందువల్లే సినిమా విడుదల ఆలస్యం అయ్యింది.

ట్రైలర్‌ కు మంచి స్పందన వచ్చింది.. మీరు అందుకున్న వ్యక్తిగత అత్యుత్తమ ప్రశంస ఏది?

చాలా మంది దర్శకులు నాకు వ్యక్తిగతంగా కాల్‌ చేసి అభినందించారు. పూరి జగన్నాద్‌, లింగుస్వామి, బాబీ, జయం రవి వంటి ప్రముఖులు ట్రైలర్‌ చూసి అభినందించారు.

మీరు సినిమా ప్రీ ప్రొడక్షన్‌ సమయంలో అనుకున్న బడ్జెట్‌ తోనే పూర్తి చేయగలిగారా?

నిజం చెప్పాలంటే మేము అనుకున్న బడ్జెట్‌ కంటే తక్కువలోనే పూర్తి చేశాం. షూటింగ్‌ అనుకున్నదాని కంటే తక్కువ రోజుల్లో పూర్తి అవ్వడం వల్ల బడ్జెట్‌ విషయంలో చాలా ప్లస్‌ అయ్యింది.

కోన వెంకట్‌ గారికి అమెరికాలో మంచి పరిచయాలు ఉన్నాయి. అవి మీకు ఏమైనా ఉపయోగపడ్డాయా?

కోన గారికి అమెరికాలో పరచయాలు బాగానే ఉన్నాయి. కాని సినిమా కోసం మేము అంతా కష్టపడ్డాం. టీం వర్క్‌ వల్లే చాలా తక్కువ సమయంలో షూటింగ్‌ ను మేము పూర్తి చేయగలిగాం.

మీ భవిష్యత్తు ప్రాజెక్ట్స్‌ ఏంటీ?

ప్రస్తుతం నేను రెండు స్ర్కిప్ట్‌ లపై వర్క్‌ చేస్తున్నాను. అందులో ఒకటి యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ కాగా రెండవది యాక్షన్‌ ఓరియంటెడ్‌ థ్రిల్లర్‌ మూవీ. ఈ రెండు సినిమాలను కూడా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కంచేందుకు ప్రయత్నాలు చూస్తున్నాను.

‘నిశబ్దం’ విడుదల రోజు యూనిట్‌ సభ్యులు అంతా గెట్‌ టు గెదర్‌ అవ్వబోతున్నారా?

మేము దాన్ని ప్లాన్‌ చేస్తున్నాం. కాని మాధవన్‌ దుబాయిలో ఉన్నారు, అనుష్క బెంగళూరులో ఉన్నారు. అంజలి గారు ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ మూవీ షూటింగ్‌ లో ఉన్నారు. ఆ రోజు వరకు ఏం జరుగుతుందో చూడాలి. సినిమాను అందరం కలిసి చూడాలని మాత్రం అనుకుంటున్నాం.

ఈ సినిమా ఏ జోనర్‌ కు చెందినదో చెప్తారా?

సినిమాలో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌, హర్రర్‌ సీన్స్‌ ఒక జోనర్‌ అని కాకుండా మల్టీ జోనర్‌ లో ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకులు ఖచ్చితంగా థ్రిల్లింగ్‌ ఫీల్‌ అవుతారు.

అనుష్క ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయకూడదని పట్టుబట్టిందని వార్తలు వచ్చాయి. ఆ విషయం నిజమేనా?

అనుష్క గారు పూర్తిగా సినిమా క్వాలిటీగా రావాలనే విషయమై ఆలోచించారు. ఎప్పుడు కూడా సినిమా ఓటీటీ విడుదల విషయంలో ఆమె అభ్యంతరం చెప్పలేదు. థియేటర్లు ఎప్పుడు రీ ఓపన్‌ అవుతాయో చెప్పలేని పరిస్థితి. అందుకే అందరం కూడా చర్చించుకుని ఓకే అనుకుని ఓటీటీలో విడుదలకు సిద్దం అయ్యాం.

మొదట ‘నిశబ్దం’ సినిమాను మూకీగా తీయాలనుకున్నారని.. ఆ తర్వాత ప్లాన్‌ మార్చారని విన్నాం. అది నిజమేనా?

నేను చాలా కాలం క్రితం ఈ సినిమా కథను రాసుకున్నాను. ఆ సమయంలో మూకీ సినిమా కథగానే రాసుకున్నాను. అయితే షూటింగ్‌ ప్రారంభం అయిన తర్వాత స్టార్‌ కాస్టింగ్‌ పెరగడంతో మూకీగా వస్తే బాగోదనే ఉద్దేశ్యంతో ప్లాన్‌ చేశాం. అనుష్క మాత్రమే మూవీ మిగిలిన వారు అంతా టాకీగానే ఈ సినిమా ఉంటుంది.

ఇటీవల మోహనకృష్ణ ఇంద్రగంటి ఓటీటీ విడుదలను వ్యతిరేకించారు. ప్రేక్షకులు థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ మిస్‌ అవుతున్నారు అన్నారు. దానిని మీరు ఏకీభవిస్తారా?

తప్పకుండా అది నిజమే. కాని ప్రస్తుత పరిస్థితుల్లో మరో మార్గం లేనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీ విడుదలకు వెళ్లాల్సి వస్తుంది. ప్రేక్షకులు మంచి సౌండ్‌ సిస్టం లేదా హెడ్‌ ఫోన్స్‌ పెట్టుకోవడం వల్ల సౌండ్‌ అనుభూతిని పొందవచ్చు. అలా కాస్త అయినా థియేటర్‌ ఫీల్‌ కలుగుతుంది.

ఇంటర్వ్యూ బై హరీష్

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...