Switch to English

బిగ్‌ బాస్‌ 4: జున్నుగాడి రాకతో తారాస్థాయికి చేరిన ఎమోషన్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

నిన్నటి ఎపిసోడ్‌లో అఖిల్‌, హారిక, అభిజిత్‌, అవినాష్‌ ల తల్లులు వచ్చారు. వారు ఉన్నది కొద్ది సమయం అయినా కూడా ఇంటి సభ్యుల మద్య ఉన్న గొడవలు అన్ని కూడా పటాపంచలు చేశారు. ముఖ్యంగా అఖిల్‌ మరియు అభిజిత్‌లు గట్టి కౌగిలింతతో తమ మద్య ఉన్న గొడవకు స్వస్థి చెప్పినట్లుగా అనిపించింది. ఇక నేటి ఎపిసోడ్‌ లో లాస్య, అరియానా, సోహెల్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ రాబోతున్నారు.

లాస్య కొడుకు జున్ను రావడంతో ఎమోషన్స్‌ పీక్స్‌ కు చేరాయి. సాదారణంగానే కొడుకును తల్చుకుని ప్రతి రోజు ఏదో ఒక సమయంలో ఎమోషనల్‌ అవుతూ ఉండే లాస్య ఈసారి కొడుకు కళ్ల ముందు ఉండి టచ్‌ చేయలేక పోవడంతో విలవిలలాడిపోయింది. అదే సమయంలో ఆమె ఆనందంకు అవధులు లేకుండా ఉంది. మంజునాధ్‌ రాకతో లాస్య కళ్లలో ఆనందం కనిపించింది. ఐ లవ్‌ యూ అంటూ గ్లాస్‌ పై రాసి అతడి ని ఎంతగా మిస్‌ అవుతుందో చెప్పే ప్రయత్నం చేసింది.

ఎపిసోడ్‌ కు హైలైట్‌ గా లాస్య, జున్ను, మంజునాథ్‌ల ఎమోషన్స్‌ నిలిచాయి. జున్ను తో ఇతర కుటుంబ సభ్యులు కూడా కొంత సమయం ఆడుకున్నారు. అవినాష్‌ జోకర్‌ ముక్కు పెట్టుకుని జున్నును ఆకర్షించాడు. ఏంటీ ఏంటీ(ఆంటీ) అంటూ మంజునాధ్‌ ముందు ర్యాగింగ్ చేసి లాస్యను అఖిల్‌ సోహెల్‌ లు ఆటపట్టించారు.

ఇక సోహెల్‌ తండ్రి చాలా జోష్‌ గా కనిపించాడు. కథ వేరే ఉంది బయట అన్నట్లుగా కొడుకు సాధిస్తున్న విజయాన్ని ఆస్వాదిస్తున్న తండ్రి మాదిరిగా అతడు కనిపించాడు. సోహెల్‌ తండ్రి కూడా చాలా సరదాగా ఇంటి సభ్యులతో మాట్లాడాడు. ఇక అరియానా సన్నిహితుడు వచ్చాడు. అతడిని చూసి అరియానా చాలా ఎమోషనల్‌ అయ్యింది.

అరియానా కోసం అమ్మ లేదా చెల్లి కాకుండా తన స్నేహితుడు రావడంతోనే వారి జీవితంలో అతడు ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. అతడిని చూడగానే బోరున ఏడ్చేసిన అరియానా ఒక పాయింట్ లో నాతో మా అమ్మ చెల్లి కూడా లేదు కానీ తిను నాతో ఉన్నాడు, ఐ లవ్ యు వినయ్ అని గట్టిగా అరిచి తన ప్రేమని తెలిపింది.

మోనాల్‌ మదర్ మాత్రం రాలేదు, తాను వద్దామని అనుకున్నా కొన్ని కారణాల వల్ల రాలేకపోయానని చెప్పిన వాయిస్‌ ను వినిపించారు. దాంతో మోనాల్‌ కన్నీరు పెట్టుకోవడమే కాకుండా, బాత్‌ రూంలోకి వెళ్లి గోడల్ని కొడుతూ, గట్టి గట్టిగా ఏడ్చేసింది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. మొత్తానికి నేటి ఎపిసోడ్‌ లో కూడా ఎమోషన్స్‌ తారాస్థాయికి వెళ్లాయి. క్లైమాక్స్‌ కు సీజన్‌ రావడందో రేటింగ్‌ ను పొందాలంటే ఇలాంటి ఎమోషనల్‌ ఎపిపోడ్‌ లు కొన్ని అవసరం. కొత్త పద్దతి ఏం కాకున్నా పాతదే అయినా ప్రేక్షకులను కట్టిపడేసేవి. అందుకే నిన్న, నేడు ఎపిసోడ్‌ లకు మంచి స్పందన వచ్చింది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు...

Fathers Day: ఫాదర్స్ డే.. ‘నాన్నే తొలి హీరో’.. చిరంజీవి సహా...

Fathers Day: నేడు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి కొణిదెల వెంకట్రావు జ్ఞాపకాల్లోకి వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియా ఖాతాల్లో తండ్రితో ఉన్న ఫొటోను...

రేణు దేశాయ్‌ని లాగుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్, సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను టార్చర్ చేస్తున్నట్లుగా, వాటిపై ఆమె స్పందిస్తున్నట్లుగా...

రాజకీయం

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఆరా మస్తాన్ ఎఫెక్ట్.! కోట్లు కొల్లగొట్టబడ్డాయ్.!

ఎవరీ ఆరా మస్తాన్.? ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీలో వుండేవాడు.! ఇప్పటికీ వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితుడే.! ఆరా మస్తాన్ ఇచ్చే ఎగ్జిట్ పోల్ కోసం వైసీపీ...

మోసపోయిన జగన్.! మోసం చేసిందెవరు.?

ఓటమిని అంగీకరిస్తూ మీడియా ముందుకు వచ్చినప్పుడే వైఎస్ జగన్, ‘నేను మోసపోయాను’ అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ‘ఆ ఆప్యాయతలు ఏమైపోయాయో..’ అంటూ జనం మీద అక్కసు వెల్లగక్కారు వైఎస్ జగన్. అప్పట్లో వైఎస్ జగన్...

తమ్ముడి కోసం అన్నయ్య చిరంజీవి ఇంకెన్ని ‘సర్‌ప్రైజ్’లు దాచారో.!

మాజీ కేంద్ర మంత్రి, పద్మ విభూషణుడు, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కోసం బోల్డన్ని ‘సర్‌ప్రైజ్’లు ప్లాన్ చేసినట్టున్నారు. ఒక్కోటీ వదులుతున్నారాయన. ఎన్నికల ముందర...

ఫర్నిచర్ దొంగ.! నువ్వు నేర్పిన విద్యయే కదా.!

కోడెల శివప్రసాద్.. దివంగత నేత.! తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగి, అనూహ్యంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.! టీడీపీలో జరిగిన అవమానాలే కారణం.. అనే ప్రచారం అప్పట్లో వైసీపీ గట్టిగా...

ఎక్కువ చదివినవి

విజయ్ ఆంటోని ‘ తుఫాన్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

"బిచ్చగాడు" సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరో విజయ్ ఆంటోనీ. మరోసారి ఆయన "తుఫాన్" మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ బ్యానర్ పై కమల్...

సినిమాకి ఆంధ్ర ప్రదేశ్‌లో ఇకపై అంతా శుభమేనా.?

తెలుగు సినిమా గడచిన ఐదేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనేక అవమానాల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కొంది. మరీ ముఖ్యంగా మెగా కాంపౌండ్‌కి సంబంధించిన సినిమాలు కావొచ్చు, మెగా హీరోలకు మద్దతుదా నిలిచే హీరోల...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 12 జూన్ 2024

పంచాంగం తేదీ 12- 06-2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:33 గంటలకు తిథి: శుక్ల షష్ఠి సా. 6.26...

భారీ వేతనంతో సింగరేణిలో ఉద్యోగాలు

కొత్తగూడెం లోని సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ వివిధ భాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ క్యాడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్...

Pawan Kalyan : ఉపముఖ్యమంత్రి పదవి పై పవన్‌ కళ్యాణ్‌ కి…!

Pawan Kalyan : ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ యొక్క కృషిని ఏ ఒక్కరు తక్కువ చేయలేరు. బీజేపీని ఒప్పించి, తక్కువ సీట్లకే పరిమితం అయ్యి,...