ఒకే ఎన్నికల కోడ్. రెండు ఒకే తరహా రైతు ఆర్థిక భరోసా స్కీమ్లు. ఓ స్కీమ్ కేంద్రానిది, మరో స్కీమ్ రాష్ట్రానిది. ఎన్నికల కోడ్ను అమలు చేయడంలో మాత్రం ద్వంద్వ ప్రమాణాలు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘పీఎం కిసాన్ స్కీమ్’ కింద దేశంలోని రైతులకు 19 వేల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. అదే ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ‘కాలియా స్కీమ్’ కింద రైతులకు పంట పెట్టుబడి కింద నిధులను విడుదల చేయడానికి ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రధానాధికారి అనుమతించలేదు.
పైగా కేంద్రం కన్నా ముందు నుంచే ఒడిశా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ రెండు పథకాలు కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రైతు బంధు’ పథకం లాంటివే.తెలంగాణ రాష్ట్రంలో లాగా కాకుండా ఒడిశా ఈ రైతు ఆర్థిక భరోసా పథకాన్ని సన్న, చిన్నకారు రైతులతోపాటు భూమి కౌలుదారులకు (టెనెంట్స్) కూడా అమలు చేస్తోంది.
అంతేకాకుండా కేంద్రంలోలాగా ఆరువేలో, తెలంగాణలాగా తొమ్మిదివేలో కాకుండా ఏడాదికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. రెండు ఒకే తరహా పథకాలు అయినప్పుడు కేంద్రం నిధుల విడుదలకు అనుమతించిన ఎన్నికల కమిషన్ తమ రాష్ట్రం నిధుల విడుదలను అడ్డుకోవడం ఏమిటని ఒడిశా పాలకపక్ష బిజూ జనతాదళ్ అధికార ప్రతినిధి సుశ్మిత్ పాత్ర ప్రశ్నించారు.
771011 837068Aw, this became an extremely good post. In idea I would like to set up writing like that additionally – taking time and actual effort to create a great article but what / items I say I procrastinate alot by means of no indicates appear to get something completed. 74468
944995 361917I wanted to say Appreciate providing these details, youre doing a terrific job with the web site… 727542
812112 888946You will be able use all sorts of advised attractions with various car treatments. A quantity of sell traditional tools numerous demand families for almost any event for any investment district, or even for a holiday in new york. ???? ??? ?????? ????? 370878
911250 372389Some truly nice and utilitarian info on this internet internet site , besides I think the layout holds wonderful functions. 582935