Switch to English

అన్నాడీఎంకే పంచాయతీ తెగింది.. పళనిస్వామికే ఓపీ‘ఎస్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో గత కొన్నినెలలుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై సాగుతున్న పంచాయతీకి పుల్ స్టాప్ పడింది. సీఎం అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామి (ఈపీఎస్) ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని సీఎం అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన పార్టీ సమన్వయకర్త, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) బుధవారం జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ప్రకటించారు.

నిజానికి సీఎం అభ్యర్థి నేనంటే నేనంటూ గత కొంతకాలంగా ఇరువురూ వాదులాడుకుంటున్నారు. గతవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఇరువర్గాలూ తమ తమ నేతలకు మద్దతుగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పన్నీర్, పళని మధ్య వాగ్దుద్ధం జరిగింది. తనను సీఎంగా రెండుసార్లు దివంగత జయలలితే ఎంపిక చేసినందున తనకే అవకాశం ఇవ్వాలని పన్నీర్ పేర్కొనగా.. ఇద్దరినీ శశికళే ఎంపిక చేశారని పళనిస్వామి వాదించారు.

ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని తేల్చేందుకు 11 మందితో కమిటీ వేయాలని పన్నీర్ ప్రతిపాదించగా.. కమిటీ అవసరం లేదని, పార్టీపరంగానే నిర్ణయం తీసుకోవచ్చని పళనిస్వామి స్పష్టంచేశారు. దాదాపు 5 గంటలపాటు సమావేశం వాడీవేడిగా జరిగినా ఈ విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన జనరల్ బాడీలో ఈ అంశంపై మంగళవారం ఇరువురు నేతలతోనూ పార్టీ నాయకులు, మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు.

మంత్రులు తంగమణి, వేలుమణి, జయకుమార్, షణ్ముగం, ఉదయ్ కుమార్ లతోపాటు పార్టీ కోఆర్డినేటర్లు కేపీ మునుస్వామి, వైతలింగం తదితరులు పన్నీర్ సెల్వంతో బుధవారం తెల్లవారుజాము వరకు చర్చలు జరిపారు. అనంతరం ఏకాభిప్రాయానికి రావడంతో పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా పన్నీర్ ప్రకటించారు.

ఇదే సందర్భంలో పార్టీ స్టీరింగ్ కమిటీని కూడా ప్రకటించారు. పళనిస్వామి వర్గానికి చెందిన ఆరుగురు, పన్నీర్ అనుచరులు ఐదుగురుతో కలిపి ఈ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇరువురు నేతలూ సయోధ్యకు రావడంతో అన్నాడీఎంకేలో ఎలాంటి చీలికా రాకుండానే ప్రస్తుత సమస్య పరిష్కారమైంది. పార్టీపరంగా ఉన్న సమస్యలు సర్దుబాటు అయిన నేపథ్యంలో ఇక ఎన్నికలపై దృష్టి పెడతామని అన్నాడీఎంకే నేతలు పేర్కొన్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...