Switch to English

సైరాతో .. మెగా వివాదం రాజుకుంటుందా ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

మెగా ఫ్యామిలీ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవంటూ చెప్పుకునే మెగా హీరోల మధ్య వివాదం రేగుతుందన్న విషయం ఇప్పటికే రెండు మూడు సార్లు బహిర్గతమైంది. మెగా ఫాన్స్ అన్న బ్రాండ్ నుండి .. అల్లు అర్జున్ బయటపడి సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇదివరకే రెండు మూడు సార్లు అల్లు అర్జున్ అభిమానులకు, అటు మెగా అభిమానుల మధ్య తీవ్ర విమర్శలు సోషల్ మీడియా వేదికగా చేసుకున్నారు. ఆ తరువాత అల్లు అర్జున్ ఓ వేడుకలో పవన్ ఫాన్స్ ని రెచ్చగొట్టేలా .. చెప్పను బ్రథర్ అంటూ కామెంట్ చేసాడు. ఆ తరువాత ఛాంబర్ లో పవన్ కళ్యాణ్ ను గట్టిగా కౌగలించుకుని ఆ వివాదాలకు పులిస్టాప్ పెట్టాడని అనుకున్నారు. కానీ తాజగా సైరా వేడుక విషయంలో మరోసారి మెగా ఫాన్స్ కు అటు అల్లు అర్జున్ ఫాన్స్ కు మధ్య గట్టి రచ్చ జరుగుతుంది.

తాజగా హైద్రాబాద్ లో సైరా ప్రీ రిలీజ్ వేడుకను భారీగా ప్లాన్ చేసారు .. ఈ వేడుకకు మెగా హీరోలందరూ వచ్చారు .. కానీ బన్నీ మాత్రం రాలేదు. కావాలనే బన్నీ ఈ వేడుకకు డుమ్మా కొట్టాడంటూ మెగా ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. మెగా హీరోలంతా వస్తే బన్నీ ఎందుకు రాలేదు. చిరంజీవి తన దేవుడు, గురువు అంటూ చెప్పుకునే బన్నీ ఎందుకు డుమ్మా కొట్టాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు అల్లు అర్జున్ కు సైరా వేడుక విషయంలో ఎలాంటి ఆహ్వానం అందలేదన్నది మరో టాక్ .

సొంత ఇమేజ్ కోసం అల్లు అర్జున్ ఆర్మీ ని తయారుచేసుకునే పనిలో బిజిగా ఉన్నాడని, అందుకే మెగా ఫాన్స్ తోనూ , అటు మెగా కాంపౌండ్ తోనూ దూరంగా ఉంటున్నాడని టాక్. సైరా విషయంలో కూడా ట్రైలర్ ని షేర్ చేస్తూ సపోర్ట్ చేసిన బన్నీ .. టీజర్ విషయంలో సైలంట్ గా ఉన్నాడు. దాంతో మెగా అభిమానులు బన్నీ పై రకరకాల కామెంట్స్ చేస్తుంటే .. అటు అల్లు అర్జున్ అభిమానులు.. కూడా దాన్ని తిప్పికొడుతూ నానా రచ్చ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో అంటూ మెగా కంపౌండ్ కలవర పడుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...