Switch to English

ఆదాయం రూపాయ్‌.. అప్పు రెండ్రూపాయలోయ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌.! అప్పుల కుప్ప ఆంధ్రప్రదేశ్‌.! ఏంటో, ఆంధ్రప్రదేశ్‌ ముందు ఈ ‘చెడ్డ పేరు’ ప్రస్తావన మాత్రం పోవడంలేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోవడంతో, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ అప్పుల కుప్పగా మారిన మాట వాస్తవం. కానీ, ఆ తర్వాత రాష్ట్రాన్ని మరింత అప్పుల్లోకి నెట్టేసింది మాత్రం చంద్రబాబు పాలనే. చంద్రబాబుకి ధీటుగా అప్పులు చేయడంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.

‘అప్పు చేసి చిప్పకూడు..’ అనే ప్రస్తావనను తరచూ వింటుంటాం. మరి, ఆంధ్రప్రదేశ్‌ అప్పుల గురించి ఏలా చెప్పుకోవాలి.? అప్పు చేసి సంక్షేమ కూడు.. అనాలా.? అసలు ఈ అప్పులకి బాధ్యత వహించాల్సిందెవరు.? ‘మేం రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తున్నాం..’ అని గతంలో చంద్రబాబు చెప్పుకున్నారు.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ చెబుతున్నారు. ఉద్ధరించడం అన్న పదానికి అర్థాన్ని ‘అప్పులు చేయడం’గా ఎప్పుడు మార్చారో ఏమో.!

గడచిన మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం 19 వేల కోట్లు. ఆంధ్రప్రదేశ్‌ చేసిన అప్పులేమో 39 వేల కోట్లు. అంటే, రూపాయి ఆదాయానికి రెండ్రూపాయల అప్పు అన్నమాట. ఇవి కొత్త అప్పులు. పాత అప్పుల కథ వేరే వుంది. మొత్తంగా రాష్ట్రం నెత్తిన కనీ వినీ ఎరుగని రీతిలో అప్పుల కుప్ప కన్పిస్తోంది.

ఇంకొన్నాళ్ళు ఆగితే, రాష్ట్ర ఆదాయం ఆ అప్పులకు సంబంధించిన వడ్డీలకు కూడా సరిపోదేమో. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో ధరలు ఎక్కువే. ఇతరత్రా పన్నులూ క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. మద్యం ధరల సంగతి సరే సరి. అయినాగానీ, రాష్ట్రం అదనంగా అప్పులు ఎందుకు చేయాల్సి వస్తోంది.? ఇదేమీ మిలియన్‌ డాలర్ల ప్రశ్న కాదు. చంద్రబాబు చేసిందీ పబ్లిసిటీ స్టంట్లే.. వైఎస్‌ జగన్‌ చేస్తున్నదీ పబ్లిసిటీ స్టంట్లే.

తమ పార్టీకి పబ్లిసిటీ పరంగా కలిసొచ్చే సంక్షేమ పథకాల కోసం నిధులు కేటాయిస్తూ.. అభివృద్ధిని లైట్‌ తీసుకోవడం వల్లే ఈ దుస్థితి అనీ, ఇదే పని గతంలో చంద్రబాబు చేస్తే విమర్శించిన వైఎస్‌ జగన్‌, ఇప్పుడు తాను ముఖ్యమంత్రి అయ్యాక అప్పులు చేయడంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారని రాజకీయ పరిశీలకులు, ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధికారంలో వున్నోళ్ళు బాధ్యతారాహిత్యంతో చేసే అప్పులు భవిష్యత్‌ తరాలకు శాపంగా మారతాయని మాజీ ఐఏఎస్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

ఆదాయం రూపాయ్‌.. అప్పు రెండ్రూపాయలోయ్‌.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...