సినిమా ఇంతలో చేసాం అనేదాని కంటే ఎంత మంచి సినిమా, ఎంత కొత్తగా కథ చెప్పాం అనే అంశాలకే ప్రాధాన్యత ఇస్తూ డైరెక్టర్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ రవిబాబు. ‘అవును’, ‘అవును 2’ లాంటి సినిమాల తర్వాత రవిబాబు చేసిన మరో హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆవిరి’.
నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో రవిబాబు ప్రేక్షకులని థ్రిల్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. మార్నింగ్ షో నుంచే ఈ సినిమాకి నెగటివ్ టాక్ రావడంతో ఈవినింగ్ షోస్ కి కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. దీంతో ఆవిరి’ మొదటి రోజు డిజాష్టర్ కలెక్షన్స్ రిజిష్టర్ చేసింది.
మొదటి రోజు ఆవిరి సినిమా ఆంధ్ర – తెలంగాణలో కేవలం 8 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా కేవలం 11 లక్షలు మాత్రమే వసూలు చేసింది. కానీ ఈ సినిమాని బయ్యర్స్ 1.3 కోట్లకి కొనుగోలు చేశారు. చూస్తుంటే చిన్న సినిమానే కానీ బయ్యర్స్ కి భారీగానే నష్టాలను మిగులుస్తుంది ట్రేడ్ వర్గాల సమాచారం.
