Switch to English

‘బీజేపీ – జనసేన’ కాంబో: సోము వీర్రాజు ‘కాపు’ కాస్తారా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఎప్పుడో బీజేపీ చీఫ్‌ అవ్వాల్సిన వ్యక్తి.. కొన్ని ప్రత్యేక కారణాలతో గతంలో కాస్త వెనకబడ్డా.. చివరికి ఆయన్ను ‘కీలక’ పదవి వరించింది. ఆయనే సోము వీర్రాజు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎంపిక కావడంతో, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు సరికొత్తగా మారతాయన్న చర్చ బీజేపీ శ్రేణుల్లో కన్పిస్తున్నాయి.

ఇక, ఇప్పటిదాకా ఈ పదవిలో వున్న కన్నా లక్ష్మినారాయణ పరిస్థితి ఏంటి.? అన్నది పక్కన పెడితే, కొత్త బీజేపీ చీఫ్‌కి.. పాత బీజేపీ చీఫ్‌ శుభాకాంక్షలు అందించడం గమనార్హం. ‘కన్నా లక్ష్మినారాయణతోనే కాదు, పార్టీలో ఎవరితోనూ విభేదాల్లేవు.. అన్ని విషయాలపైనా బీజేపీ స్పష్టతో వుంది. బీజేపీలో గ్రూపులనేవే లేవు..’ అని సోము వీర్రాజు స్పష్టం చేసేశారు. ‘కన్నా లక్ష్మినారాయణ స్థానంలో తనను తీసుకు రావడమంటే కన్నా లక్ష్మినారాయణను అవమానించనట్లు కాదు..’ అని కూడా చెప్పుకొచ్చారు సోము వీర్రాజు.

ఇదిలా వుంటే, సోము వీర్రాజుకి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం. దానికి ప్రతిగా, ‘మిత్రుడు పవన్‌ కళ్యాణ్‌కి నా ధన్యవాదాలు’ అని పేర్కొనడం మరింత విశేషం. పవన్‌ కళ్యాణ్‌కి సోము వీర్రాజు ఆప్త మిత్రుడు. దాంతో, ఈ ఇద్దరి కాంబినేషన్‌.. రాష్ట్రంలో బీజేపీ – జనసేన సరికొత్త జోష్‌తో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుందని ఇరు పార్టీల నేతలూ భావిస్తున్నారు.

మరోపక్క, ‘కాపు’ సామాజిక వర్గానికే మళ్ళీ బీజేపీ చీఫ్‌ పదవి దక్కడంపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ ఎలాగూ బీజేపీకి మిత్రుడే. దాంతో, ప్రత్యేకంగా కాపు సామాజిక వర్గానికి గాలం వేసేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుని ఎంపిక చేయాల్సిన అవసరమేంటి.? అన్న వాదన ఓ వైపు నుంచి విన్పిస్తోంది. ‘జనసేన మీద బీజేపీకి నమ్మకం తగ్గిందేమో.. వైసీపీకి దగ్గరవడానికి ప్రయత్నిస్తోందేమో..’ అన్న చర్చ కూడా జరుగుతోంది.

అయితే, ‘ఇది కుల సమీకరణాల వ్యవహారం కాదు’ అని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాగా, ‘ఏం చేసినా, కమ్మ సామాజిక వర్గాన్ని బీజేపీ వైపుకు తిప్పడం సాధ్యం కాదు. పైగా, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు బీజేపీలో ఇప్పటికే కీలక పదవుల్లో వున్నారు. కానీ, బీసీ లేదా ఇతర సామాజిక వర్గాలకు ఆస్కారం ఇచ్చి వుండాల్సింది..’ అన్న అభిప్రాయం కూడా విన్పిస్తోంది. ఎవరి వాదనలు ఎలా వున్నా, తూర్పుగోదావరి జిల్లాకి చెందిన సోము వీర్రాజు ఎంపికలో బీజేపీ వ్యూహం సుస్పష్టం.

ఎగ్రెసివ్‌ నేచర్‌ వున్నా.. పార్టీలో అందరికీ ఆప్తుడు సోము వీర్రాజు. పైగా, జనసేనానితో ప్రత్యేక అనుబంధం ఆయనకి వుంది. దాంతో బీజేపీ – జనసేన బంధం మరింత బలపడ్తుందనీ, ‘కాపు’ సామాజిక వర్గ కోణంలో చూసినా, ఇది మంచి కాంబినేషన్‌ అనీ బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...