Switch to English

బిగ్‌ క్వశ్చన్‌: హిందూ దేవాలయాలపైనే ‘దాడి’ ఎందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘దేవతా మూర్తుల విగ్రహాల ధ్వంసం దుర్మార్గం.. ఇది తీవ్రమైన నేరం. ఇలాంటి ఘటనల్ని ఉపేక్షించకూడదు. పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. ఈ దాడులకు పాల్పడేవారిని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు..’ ఇదీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, తాజాగా ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా చేసిన వ్యాఖ్యల సారాంశం.

కానీ, ముఖ్యమంత్రి హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దుండుగులో ఓ దేవాలయంలోకి చొరబడి, దేవతామూర్తుల విగ్రహాల్ని ధ్వంసం చేశారు. ఎందుకిలా జరుగుతోంది. దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో దేవాలయాలపై దాడులు జరగడంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం, హిందూమతంపై కుట్రపూరితమైన దాడి జరుగుతూనే వుంది గత కొంతకాలంగా.

ఇతర రాష్ట్రాల్లోనూ ప్రముఖ దేవాలయాలున్నాయి.. అక్కడా దేవుళ్ళ రధాలున్నాయి. అక్కడెక్కడా దేవాలయాలపై దాడులు జరగడంలేదు.. రధాలు తగలబడటంలేదు. అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్‌లో.? ఇదిప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ‘విరిగింది బొమ్మ తాలూకు చెయ్యే కదా..’ అంటాడో అధికార పార్టీ నాయకుడు. పైగా, ఆయన బాధ్యతగల మంత్రి పదవిలో వున్నాడు. ‘నేనూ హిందువునే..’ అని చెప్పుకుంటాడుగానీ, ఏ హిందువు అయినా, దేవతా మూర్తుల విగ్రహాన్ని ‘బొమ్మ’ అని అనగలడా.? ఇక్కడే, అధికార పార్టీ నేతల డొల్లతనం బయటపడుతోంది.

కీలక పదవుల్లో వుండి మరీ, హిందూ మతాన్ని గేలి చేయడం.. ఈ తరహా దాడులకు మరింత ప్రోత్సాహిన్నిస్తున్నట్టుంది. ఇంకో మంత్రి, తిరుమల కొండ మీద నుంచి ‘హ్యాపీ క్రిస్‌మస్‌’ అని క్రిస్టియన్లకు శుభాకాంక్షలు చెబుతాడు. ఇవన్నీ ఒకదానికి ఒకటి లింకు లేని వ్యవహారాలని ఎలా అనుకోగలం.? చర్చిల నిర్మాణం పట్ల ప్రత్యేక శ్రద్ధ.. మైనార్టీ వర్గానికి చెందినవారు పోలీస్‌ స్టేషన్లపై దాడులు దిగినా, వారిపై కేసుల్ని ఎత్తేసేంత గొప్ప హృదయం అధికార పార్టీ నేతలకు వుంది.

దురదృష్టవశాత్తూ, ఆ బాధ్యత హిందూ మత విశ్వాసాల్ని కాపాడటంలో లేకపోవడమే అత్యంత బాధాకరమైన విషయం. రాష్ట్రంలో రెండో అతి పెద్ద రామాలయం విజయనగరం జిల్లా రామతీర్థంలో వుంది. అక్కడే, రాములోరి విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. ఇది చిన్న ఘటనగా ఎలా కొట్టి పారేయగలం.? రాష్ట్రంలో ప్రముఖమైన దేవాలయాల్లో అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఒకటి. ఆ దేవాలయం తాలూకు రధాన్ని తగలబెట్టేశారు కొందరు దుండగులు.

రాష్ట్రంలో రెండో అతి పెద్ద పుణ్యక్షేత్రం బెజవాడ దుర్గమ్మ దేవాలయం. ఆ దేవాలయం తాలూకు రధానికి చెందిన వెండి సింహాల్ని కొందరు దొంగిలించారు. చెప్పుకుంటూ పోతే, ఒకటా.? రెండా.? లెక్కలేనన్ని ఘటనలు, హిందువుల మనోభావాల్ని దెబ్బతీశాయి. ముఖ్యమంత్రి ఆదేశాల్ని అధికారులు పట్టించుకోవడంలేదా.? లేదంటే, ఈ తరహా దాడులకు పాల్పడుతున్నవారికి అధికార పార్టీ అండదండలున్నాయా.? అందుకే పోలీసులు మిన్నకుండిపోతున్నారా.? అన్నది తేలాల్సి వుంది.

రాజకీయ నాయకుల విగ్రహాలు ధ్వంసమైతేనో, సోషల్‌ మీడియాలో ఫొటోల్ని మార్ఫింగ్‌ చేస్తేనో.. అప్పటికప్పుడు కేసులు పెట్టి, రాత్రికి రాత్రి నెటిజన్లను అరెస్ట్‌ చేస్తోన్న పోలీసు యంత్రాంగం, అంతర్వేది ఘటనపైనా, బెజవాడ దుర్గమ్మ వెండి సింహాల ఘటనపైనా.. ఇంతవరకు ఎందుకు దోషుల్ని పట్టుకోలేకపోయినట్టు.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...