హైదరాబాద్ లో ఎంతో రద్దీ ప్రాంతం అయిన కోఠిలో అర్థ రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అర్థ రాత్రి సమయం అవ్వడంతో మంటల వల్ల ప్రాణ నష్టం లేకున్నా ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉన్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. షాప్ లు అన్ని కూడా క్లోజ్ చేసిన తర్వాత ఒక్క షాప్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదంతో పక్కన ఉన్న షాప్ లకు కూడా మంటలు అంటుకున్నాయి. తక్కువ సమయంలోనే ఆంధ్రా బ్యాంక్ చౌరస్తాలోని పలు షాప్ లకు మంటలు అంటుకున్నట్లుగా ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది.
అగ్ని ప్రమాదంలో ఒక బట్టల దుకాణం పూర్తిగా దగ్దం అయ్యింది. దాంతో షాపు యజమాని కన్నీరు పెట్టుకుని 40 ఏళ్లుగా ఇక్కడే బట్టల షాప్ పెట్టుకుని జీవితాన్ని గడుపుతున్నాం. ఇప్పుడు ఆ షాప్ మొత్తం కాలి బూడిద అయ్యింది. రోడ్డున పడ్డామంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా ఎంతో మంది చిన్న వ్యాపారుల జీవితాలు నడి రోడ్డుకు వచ్చే పరిస్థితి వచ్చింది. అగ్ని మాపక సిబ్బంది వెంటనే స్పందించినా కూడా మంటలు స్పీడ్ గా వ్యాప్తి చెందడంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది.
15023 465206Hello! I just now would like to supply a massive thumbs up for any wonderful information you can have here within this post. We are coming back to your weblog post for further soon. 9761
48619 88227I believe this web internet site contains very superb composed articles posts . 593366