Switch to English

బీజేపీ ‘బైబిల్ – భగవద్గీత’ రాజకీయంతో ఎవరికి లాభం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలు వేరు, ఆంధ్రపదేశ్‌లో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక వేరు. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో వాడినట్టుగా మత రాజకీయాన్ని తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో వాడదామని బీజేపీ ప్రయత్నిస్తే అంతకన్నా హాస్యస్పదం ఇంకోటుండదు.

ఆంధ్రపదేశ్‌లో రాజకీయాలు కులాలు, మతాల ప్రాతిపదికన నడుస్తున్న రోజులివి. ఓ బలమైన సామాజిక వర్గం అధికార వైసీపీకి అండగా వుంది. దానికి తోడు, ఓ మతం ఓట్లు గంపగుత్తగా వైసీపికి పడే పరిస్థితులున్నాయి.. ఆ మతానికి అనుకూలంగా వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందన్న వాదనలూ వున్నాయి. మైనార్టీ ఓటు బ్యాంకు వైసీపీకి అదనపు బలం. మరి, బీజేపీ మాటేమిటి.?

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక కోసం ‘బైబిల్ – భగవద్గీత’ అంశాన్ని తెరపైకి తెస్తే లాభపడేది బీజేపీనా.? అధికార పార్టీనా.? ఇప్పడు ఈ చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్‌గా మారుతోంది. బీజేపీ రాజకీయం కారణంగా, ఇప్పటికే వైసీపీ ఎడ్జ్ పెరుగుతూ వస్తోంది. వైసీపీకి లాభం చేకూర్చేందుకోసమే బీజేపీ ఈ కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చినట్లుంది.

వైసీపీని బైబిల్ పార్టీగా చిత్రీకరించాలన్నది బీజేపీ వ్యూహం. అది దాదాపు వర్కవుట్ అయినట్లే వుంది. అలాగని, హిందూ ఓట్లన్నీ, బీజేపీకి పడతాయా.? చాన్సే లేదు. అందుకు చాలా కారణాలున్నాయి.. బోల్డన్ని సమీకరణాలూ వున్నాయి. బీజేపీ చర్యలతో జనసేన పార్టీకి ఆంధ్రపదేశ్‌లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రాజకీయ విశ్లేషకుల్లో.

ఏ రాజకీయ పార్టీ అయినా, కుల మతాలకతీతంగా రాజకీయాలు చేయాలి. కానీ, ఆంధ్రపదేశ్‌లో అలాంటివి ఆశించలేం. వైసీపీ అనుసరిస్తున్న మతతత్వ వైఖరి అందరికీ అర్థమవుతూనే వుందన్నది బీజేపీ సహా ఇతర పార్టీ ఆరోపణ. ‘కులం చూడం.. మతం చూడం..’ అని వైసీపీ చెబుతున్న మాటల్లో డొల్లతనమే ఎక్కువని ఆయా పార్టీలు విమర్శిస్తున్న విషయం విదితమే.

అలాగని ‘మీకు బైబిల్ పార్టీ కావాలా.? భగవద్గీత పార్టీ కావాలా.?’ అని అడిగితే ఎలా.? అభివ్రుద్ధి ఎజెండా అని చెప్పి, బీజేపీ ఇప్పుడు కొత్త రూటులోకి వెళుతుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఏమోగానీ, తిరుపతి ఉప ఎన్నిక మాత్రం రాష్ట్రంలో అగ్గి రాజేసేలా వుందన్నది మాత్రం నిర్వివాదాంశం. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి, జనసేన కాస్త దూరం జరగడమే మంచిదేమో.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...